‘’రణవీర్ సింగ్ నా వాడు’’ అంటోంది దీపికా పదుకొణే! అది అందరికీ తెలిసిందేగా అంటారా? నిజమే, 2018లోనే రణవీర్ ని దీపిక కొంగున ముడి వేసుకుంది. అంతే కాదు, బాలీవుడ్ సూపర్ స్టార్ అప్పడప్పుడూ తన భార్య కోసం సొషల్ మీడియాలో అద్భుతమైన మాటలు, కవితలు రాసేస్తుంటాడు. రణవీర్ కి దీపిక మీద ఉన్న ఇష్టం చాలాసార్లు బయటపడుతూనే ఉంటుంది. అయితే, దీపూ అంతగా బయటపడదనే చెప్పాలి. కానీ, వీలైనప్పుడల్లా హజ్బెండ్ ని ఆహా, ఓహో అంటూ ఆకాశానికి ఎత్తేస్తుంటుంది!
Read Also: మూడో వెబ్ సీరిస్ కు మిల్కీబ్యూటీ గ్రీన్ సిగ్నల్!
రణవీర్ సింగ్ లెటెస్ట్ గా తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోస్ పోస్ట్ చేశాడు. గడ్డంతో మ్యాన్లీగా, సీరియస్ గా కనిపించాడు. మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ ‘’ఇంత ఇంటెన్సిటినా? నాకైతే నిన్న రాత్రి మనం పార్కింగ్ లాట్ లో మాట్లాడుకున్న సరదా మాటలే గుర్తుకు వస్తున్నాయి! యూ ఆర్ ఏ మ్యాడ్ మ్యాన్!’’ అంటూ కామెంట్ చేశాడు. రణవీర్ బెస్ట్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ ‘స్టాలియన్’ అంటూ కితాబునిచ్చాడు! ‘స్టాలియన్’ అంటే ‘మగ గుర్రం’ అని అర్థం!
రణవీర్ లెటెస్ట్ కూల్ అండ్ హ్యండ్సమ్ పిక్స్ కి అనేక రియాక్షన్స్ వచ్చినా… మిసెస్ గారి అన్ మిసబుల్ రెస్పాన్స్ కే ఎక్కువ మంది ఇంప్రెస్ అయ్యారు! దీపికా ‘మైన్’ అంటూ కామెంట్ చేసింది! ఒకే ఒక్క పదం అయినా… బోలెడు ప్రేమ ఒలకబోసింది భర్త మీద! ‘నా వాడే’ అంటూ గర్వంగా, ఆనందంగా ప్రకటించేసింది! ఎనీ వే… త్వరలో ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్… ‘83’ సినిమాలో కనిపించబోతున్నారు. కపిల్ దేవ్ గా రణవీర్ , ఆయన రోమి దేవ్ గా దీపిక నటించారు!