‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’తో సమంత ఇప్పుడు బాలీవుడ్ లోనూ ఫెమిలియర్ నేమ్ అయిపోయింది. అయితే, మనోజ్ బాజ్ పాయ్ స్టారర్ వెబ్ సిరీస్ లో ఆమె నటన చాలా మందిని ఆకట్టుకుంది. దాంతో బాలీవుడ్ లో ఆమెకు ఇప్పటికే కొన్ని ఇంట్రస్టింగ్ ఆఫర్స్ వచ్చాయట. అయితే, అక్కినేని వారి డాటర్ ఇన్ లా ఇంత వరకూ ఏ హిందీ సినిమాకు డాటెడ్ లైన్ మీద సిగ్నేచర్ చేయలేదు. కానీ, ఓ రీసెంట్ ఇంటర్వ్యూలో తన మనసులో మాట చెప్పింది సామ్…
Read Also: హాలీవుడ్ కు విద్యుత్ జమ్వాల్
బీ-టౌన్ లో తనకు నచ్చిన నటుడు ఎవరని అడిగితే మన ‘జాను’ తడుముకోకుండా రాజ్ కుమార్ రావ్ అనేసిందట. ఆయన హిందీ ఇండస్ట్రీలో కంటెంట్ ఉన్న సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్! బోలెడు యాక్టింగ్ టాలెంట్ తో చూసే వార్ని అమాంతం కట్టిపడేస్తాడు. అందుకే, సమంత కూడా రాజ్ కుమార్ రావ్ సినిమాల పట్ల ఆసక్తి చూపుతుందట. ఆయన నెక్ట్స్ మూవీ ఏంటని ఎప్పుడూ ఓ కంట గమనిస్తూ ఉంటుందట. మరి అంతగా తాను ఫాలో అయ్యే తన ఫేవరెట్ యాక్టర్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ వస్తే? ‘డౌటే లేదు’ సినిమా చేయటానికి నేను రెడీ అంటోంది సామ్! అయితే, మంచి కథ దొరకాలి కదా అని కూడా కామెంట్ చేసింది మిసెస్ చే…
సమంత ప్రస్తుతం తమిళంలో విఘ్నేశ్ శివన్ ‘కాతువాకుల రెండు కాదల్’, తెలుగులో గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమాలు చేస్తోంది. చూడాలి మరి, ఆమె నెక్ట్స్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ఏది అవుతుందో! అందులో రాజ్ కుమార్ రావ్ ఉంటాడో లేదో…