బాలీవుడ్లో వరుస చిత్రాలతో బిజీగా మారింది స్టార్ హీరోయిన్ తాప్సీ. సవాళ్లు విసిరే విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ప్రస్తుతం భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి మిథాలీ రాజ్ జీవితకథతో ‘శభాష్ మిథు’ చిత్రం తెరకెక్కుతోంది. వయాకామ్ 18 సంస్థ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా డైరెక్టర్‌ను మార్చినట్టు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాహుల్ ధోలాకియా దర్శకత్వం వహిస్తారని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. కానీ తాజాగా సమాచారం మేరకు ఆయన స్థానంలో దర్శకుడిగా శ్రీజిత్ […]
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు సాయి శ్రీనివాస్ టాలీవుడ్ లో హీరోగా తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ యేడాది ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. విశేషం ఏమంటే… సాయి శ్రీనివాస్ తమ్ముడు సాయి గణేశ్ సైతం హీరోగా తెలుగులో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. పవన్ సాదినేని దర్శకత్వంలో బెక్కెం వేణు, బీటెల్ లీఫ్ ప్రొడక్షన్స్ సంస్థతో కలసి గణేశ్ ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమాను కొంత కాలం క్రితం […]
విజయ్ సోషల్ మీడియాలో పెద్దంతగా కనిపించడు. పబ్లిక్ ఫంక్షన్స్ కూ హాజరయ్యేది తక్కువే! ఎప్పుడో ఒకటి రెండు సార్లు మాత్రం అలా మెరుపులా మెరుస్తుంటాడు. కానీ అతని అభిమానులు సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇటీవల విజయ్ బర్త్ డే సందర్భంగా కూడా అతని అభిమానులు ట్విట్టర్ స్పేస్ సెషన్ ఒకటి ఏర్పాటు చేసి, గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు. విశేషం ఏమంటే… ఆ సెషన్ లో పలువురు హీరోయిన్లు కూడా పాల్గొన్నారు. అందులో […]
మెగాస్టార్ చిరంజీవి కోడలు గానే కాదు అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి మనవరాలిగానూ ఉపాసనకు ఎంతో గుర్తింపు ఉంది. వైద్య, సేవా రంగాలలో కొన్నేళ్ళుగా తనదైన ముద్రను వేస్తూ ముందుకు సాగుతున్నారు ఉపాసన. విశేషం ఏమంటే… మెగాస్టార్ కోడలిగా కొత్త బాధ్యతలను భుజానకెత్తుకున్నా ఆమె తన దిశను మార్చుకోలేదు. పైగా మరింత వేగంగానూ, మెగా ఫ్యామిలీని కలుపుకుని తన లక్ష్యం వైపు సాగుతున్నారు. అంతేకాదు… సినిమా రంగంలో ఏర్పడిన కొత్త పరిచయాలతో మరింత విస్తారంగా సేవా […]
వివాదాలకు మారుపేరుగా మారిపోయింది కంగనా రనౌత్. చిత్రం ఏమంటే… ఆమె నోటి నుండి ఏ పదం వచ్చినా, ఆమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా అది ఏదో రకంగా వివాదాలవైపే సాగుతోంది. తాజాగా… బ్రిటీషర్స్ బానిసత్వానికి చిహ్నంగా మనకు పెట్టిన ఇండియా అనే పేరును వదిలేసి, ‘భారత్’గా దేశం పేరు మార్చుకుందని కంగనా మరో వివాదానికి తెర తీసింది. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో కంగనా రెండు పోస్టులు పెట్టింది. ఇండస్ నదికి తూర్పున […]
దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార చిత్రసీమలోకి అడుగుపెట్టి 18 సంవత్సరాలు గడిచినా… ఇంకా తన సత్తా చాటుతూనే ఉంది. కొంతకాలంగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు నయన్ ప్రాధాన్యమిస్తున్నా, స్టార్ హీరోల చిత్రాలలోనూ నటిస్తూనే ఉంది. తాజాగా ఆమె పేషన్ స్టూడియోస్ తో రెండు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకుంది. అభిషేక్ పిక్చర్స్ తో కలిసి వీటిని పేషన్ స్టూడియోస్ నిర్మించనుంది. అందులో మొదటి ప్రాజెక్ట్ ను ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించబోతున్నాడట. ఈ మూవీలో రెండు ప్రధానమైన […]
తెలంగాణ రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ ఎత్తివేయడంతో పాటు సినిమా థియేటర్లును కూడా తెరుచుకోవచ్చు అని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దాంతో సినిమా ప్రేమికులు రెండు నెలల తర్వాత థియేటర్లు ఓపెన్ కావడంపై హర్షం వ్యక్తం చేశారు. కానీ సినిమా థియేటర్ యాజమాన్యాలు మాత్రం పెద్ద సినిమాలు వచ్చేదాకా ఎదురుచూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీలోను థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో కొత్త సినిమాలు విడుదల తేదీలను ప్రకటించే పనిలో పడ్డాయి. అయితే థియేటర్లు […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు సుకుమార్ బన్నీని గతంలో ఎన్నడూ చూడని విధంగా కళ్ళు చెదిరే సీన్స్ ప్లాన్ చేశారని, ఇందుకోసం సుకుమార్ తన క్రియేటివిటీకి పదును పెట్టారని తెలుస్తోంది. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందిస్తున్నారు సుకుమార్. పాన్ ఇండియా సినిమాగా పలు భాషల్లో రూపొందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా, కరోనా […]
పసిడి ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం నుంచి బంగారం ధర పతనమవుతూ వస్తోంది. తాజాగా బుధవారం బంగారం ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,100 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.48,110 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 73,000 గా వుంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 44,100 ఉండగా.. 24 […]
తూర్పు గోదావరి జిల్లాలోని పోలవరం ముంపు ప్రాంతాలకు భారీగా వరద నీరు చేరింది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వాగునీరు చేరడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా వరద నీరు చేరడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాగా దేవీపట్నం నుంచి మైదాన ప్రాంతాలకు రాకపోకలు మంగళవారం ఉదయం నుంచి నిలిచిపోయాయి. పోలవరంలో ముంపునకు గురవుతున్న పలు గ్రామాల ప్రజలు తమ సామగ్రిని తరలించేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.