విరాన్ ముత్తంశెట్టి హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘బతుకు బస్టాండ్’. నికిత అరోరా, శృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఐ.ఎన్. రెడ్డి దర్శకత్వంలో ఐ. కవితారెడ్డి, కె. మాధవి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహవీర్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాలోని మొదటి పాటను ఇటీవల విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభించింది. దాంతో ఈ రోజున మాస్ సాంగ్ ‘బుస్సా… బుస్సా’ను రిలీజ్ చేశారు. బ్రెజిలియన్ మోడల్ జెన్నీఫర్ పిక్కినాటో నటించిన ఈ ఐటమ్ […]
రమణ్ కథానాయకుడిగా కె. శిరీషా రమణారెడ్డి నిర్మిస్తున్నచిత్రం రెడ్డిగారింట్లో రౌడీయిజం. ఎం. రమేష్, గోపి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. వర్ష విశ్వనాథ్, ప్రియాంక, పావని, అంకిత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేశారు. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉందని, సినిమా పెద్ద హిట్ కావాలని అభిలషిస్తూ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు వినాయక్. ఈ సందర్భంగా హీరో రమణ్ మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, గోవా, […]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంతవరకూ ఏదీ రాలేదు. అయితే అది ఏ రోజైనా రావచ్చుననే అంతా భావిస్తున్నారు. ‘ఎర్లీ బర్డ్ క్యాచెస్ ది వార్మ్’ అన్నట్టుగా విలక్షణ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాశ్ రాజ్ ఇప్పటికే తన ప్యానల్ ను ప్రకటించేశారు. మరో వైపు మంచు విష్ణు తన తండ్రిని తోడ్కొని సినిమా పెద్దల్ని కలిసి వస్తున్నారు. అయితే ఇవాళ తన ప్యానల్ తరఫున నిలబడబోయే వారి పేర్లను […]
ఆయన వేదిక ఎక్కితే పాట పాడకుండా ఉండలేరు. అప్పటికప్పుడు పదాలతో పాట కట్టేస్తారు. అలాంటి వ్యక్తి ఈ మధ్య పాడిన ఒకేఒక పాటతో సైలెంట్ అయిపోయారు. అదే ఆయన చివరి పాట. మీటింగ్‌కు వస్తే పాటల్లేవ్.. మాటల్లేవ్. ఎవరా వ్యక్తి? పాటల్లేవు.. పొడి పొడి మాటలే! తన పాటలతో తెలంగాణ ఉద్యమంలో గుర్తింపు తెచ్చుకుని.. ఎమ్మెల్యే అయిన వ్యక్తి రసమయి బాలకిషన్. ఎమ్మెల్యే అయినా పాటను మర్చిపోలేదు. సభలు, సమావేశాల్లో రసమయి ఉంటే పాట కూడా ఉంటుంది. […]
ఇటీవల ‘పిట్ల కథలు’ ఆంథాలజీలో మెరిసిన ఈషారెబ్బ ప్రస్తుతం తెలుగులో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీలో మాత్రం నటిస్తోంది. అయితే ఈ అందాల చిన్నది ఇప్పుడు సరిహద్దులు దాటి తమిళ, మలయాళ చిత్రాలపై కన్నేసింది. నిజానికి ‘అంతకు ముందు ఆ తర్వాత’ మూవీ తర్వాత ‘అమీ తుమీ’ ‘అ’, ‘అరవింద సమేత’ చిత్రాలు మాత్రమే ఇషారెబ్బా కు గుర్తింపు తెచ్చిపెట్టాయి. చిత్రంగా ఈ సినిమాల పేర్లన్నీ ‘అ’తోనే మొదలు కావడం ఓ విశేషం. ఇంతకూ విషయం ఏమంటే… […]
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన నటి నివేదా పేతురాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఆర్డర్ చేసిన ఫ్రైడ్ రైస్ లో బొద్దింక ఉండడంతో సదరు ఫుడ్ డెలీవరి రెస్టారెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ ప్రముఖ రెస్టారెంట్ నిన్న (బుధవారం) సాయంత్రం నివేదా పేతురాజ్ ఫ్రైడ్ రైస్‌ను ఆర్డర్ చేసింది. ఫుడ్ డెలీవరి అయిన అనంతరం ప్యాక్ ఓపెన్ చేయగానే అందులో ఆమెకు చచ్చిన బొద్దింక కనిపించింది. దీంతో నివేదా పేతురాజ్, రెస్టారెంట్‌ని ట్యాగ్ చేస్తూ […]
గత కొన్ని రోజులుగా సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ మ్యూజిక్ రంగంలోకి అడుగుపెడుతోందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో నూరు శాతం వాస్తవం ఉందని సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు ప్రకటించారు.”1964లో డా. రామానాయుడుచే స్థాపించబడిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ జాతీయ సినిమాకు 50 ఏళ్ళకు పైగా సహకారం అందించిన భారతదేశపు అతిపెద్ద చిత్ర నిర్మాణ సంస్థలలో ఒకటిగా అవతరించిన విషయం తెలిసిందే. ఎక్కువ సంఖ్యలో భారతీయ భాషల్లో సినిమాలు […]
బాలీవుడ్ బాద్షా… కింగ్ ఖాన్… ఇలాంటి టైటిల్స్ షారుఖ్ కి ఊరికే రాలేదు. వాటి వెనుక ఎంతో శ్రమ, అదృష్టం, బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి! అందుకే, ఎస్ఆర్కే తో సినిమా అంటే సీనియర్ బ్యూటీస్ మొదలు ఈ తరం న్యూ బేబీస్ వరకూ అందరూ రెడీ అనేస్తారు. కింగ్ ఆఫ్ రొమాన్స్ అనిపించుకున్న షారుఖ్ బాలీవుడ్ హీరోయిన్స్ కి హాట్ ఫేవరెట్! అయితే, ఇదంతా నిజమే అయినా ‘ఆ నలుగురు’ కథానాయికలు మాత్రం ‘సారీ, ఎస్ఆర్కే!’ […]
త్వరలో జరగబోయే MAA ఎలక్షన్స్‌ని పురస్కరించుకుని ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ ని ప్రకటించారు. ‘మా’ శ్రేయస్సు దృష్ట్యా.. నిర్మాణాత్మక ఆలోచనలని ఆచరణలో పెట్టే దిశగా మా ప్రతిష్టకోసం.. నటీ నటుల బాగోగుల కోసం.. సినిమా నటీనటులందరి ఆశీస్సులతో.. అండదండలతో.. ఎన్నికలలో నిలబడటం కోసం.. పదవులు కాదు పనులు మాత్రమే చేయడం కోసం అంటూ ‘మా’ టీంతో రాబోతున్న విషయాన్ని తెలియచేశారు. ప్రకాష్‌రాజ్ ప్యానెల్ ప్రకాష్‌రాజ్ జయసుధ శ్రీకాంత్ బెనర్జీ సాయికుమార్ తనీష్ ప్రగతి అనసూయ సన […]