తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్, దండకారణ్యం మాడ్ డివిజన్ – ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సిద్దబోయిన సారక్క అలియాస్ భారతక్క ఇరువురు కరోనా లక్షణాలతో బాధపడుతూ మృతి చెందినట్లు ధృవీకరిస్తూ.. ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదలైంది. జూన్ 21న ఉదయం 9 గంటలకు తుదిశ్వాస విడిచినట్లుగా లేఖలో పేర్కొన్నారు. జూన్ 22న అంత్యక్రియలు ప్రజల మధ్యనే పూర్తి చేసి, శ్రద్ధాంజలి ఘటించినట్లుగా మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ లేఖలో తెలిపాడు. ఈమేరకు హరిభూషన్, భరతక్కల కుటుంబసభ్యులకు మావోయిస్టు పార్టీ ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నారు. కరోనా విషయంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కుటిలా ప్రయత్నం చేశాయని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ లేఖలో పేర్కొన్నారు.