తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో త్వరలోనే ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇది తెరకెక్కనుంది. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల, ధనుష్ కలిసి నిర్మించనున్నారు. ధనుష్ తెలుగులో నటించనున్న ఫస్ట్ మూవీ ఇదే. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్, షూటింగ్ వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఇదిలావుంటే, ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి గాసిప్స్ వార్తలు ఎక్కువ అయ్యాయి. హీరోయిన్ ఎంపిక మొదలు, ధనుష్ రెమ్యూనరేషన్ దాకా వరుసగా వార్తలు ప్రచారం అవుతూనే ఉన్నాయి. అయితే ఈసారి ఫీల్ గుడ్ చిత్రాలతో ప్రేక్షకుల మనసులు దోచుకునే శేఖర్ కమ్ములపై పడింది. ఈ చిత్ర కథ పొలిటికల్ నేపథ్యంలో సాగనుందని తెలుస్తోంది. శేఖర్ చెప్పిన కథకు ధనుష్ ఇంప్రెస్స్ అయ్యే ప్రాజెక్ట్ కు కమిట్ అయ్యాడని తెలుస్తోంది. తమిళనాడు రాజకీయాలతో ముడిపడిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా కథను సిద్ధంచేసాడని సమాచారం. అయితే శేఖర్ కమ్ముల గతంలోనూ రానా దగ్గుబాటితో లీడర్ సినిమా చేసి మెప్పించిన విషయం తెలిసిందే. అయితే మరోసారి ఈ దర్శకుడు పొలిటికల్ టచ్ లో సినిమా చేస్తాడో, లేదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే!