న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ సినిమా బాలీవుడ్ లోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘జెర్సీ’ని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి హిందీ రీమేక్‌కూ దర్శకత్వం వహిస్తున్నారు. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నాని నటన అద్భుతంగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ సినిమా హిందీ రీమేక్ లో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ నానిపై ప్రశంసలు కురిపించారు. నాని జెర్బీ మూవీలో అద్భుతంగా నటించాడని షాహిద్ కపూర్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా […]
ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కేంద్ర పర్యాటక శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ను తెలంగాణ మంత్రులు కోరారు. ఈమేరకు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవిత, బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌కు బుధవారం దిల్లీకి వెళ్లి వినతిపత్రం సమర్పించారు. మేడారం జాతరకు ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం రూ. 200 కోట్లు వెచ్చిస్తోందని, కేంద్రం నుంచి కూడా […]
హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై పలు చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. అయితే కరోనా కారణంగా వీటి షూటింగ్స్ కు బ్రేక్ పడింది. తాజాగా తెలంగాణలో సంపూర్ణంగా లాక్ డౌన్ ఎత్తివేయడం, కొవిడ్ 19 కేసులు తగ్గుముఖం పట్టడంతో ఫిల్మ్ ఛాంబర్ నిర్దేశించిన సూచనలను అనుసరిస్తూ పలు నిర్మాణ సంస్థలు షూటింగ్స్ మొదలు పెట్టాయి. సితార ఎంటర్ టైన్స్ మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ సైతం తమ చిత్రాలను తిరిగి పట్టాలెక్కించడం […]
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, జయదేవ్ గల్లా తనయుడు, మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్ లో ‘హీరో’గా ఎంట్రీ ఇస్తున్నాడు. నిజానికి దిల్ రాజు లాంచ్ చేయాల్సిన అశోక్ ను ఇప్పుడు ఆయన తండ్రి జయదేవ్ గల్లానే ఓన్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ టైటిల్ ను, […]
‘మా’ ఎన్నికలతో (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. త్వరలో జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు పోటీదారులతో రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధ్యక్ష బరిలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్‌తో పాటు మంచు విష్ణు పోటీకి దిగుతుండగా.. జీవిత రాజశేఖర్ కూడా పోటీలో ఉంటుందనే వార్తలతో అంత ట్రయాంగిల్ వార్ అనుకున్నారు. అయితే, తాజాగా నటి హేమ అనూహ్యంగా రేసులోకి వచ్చింది. ఈసారి ‘మా’ బరిలో ఆమె కూడా దిగుతున్నట్లుగా నమ్మదగ్గ సమాచారం. ఇప్పటికే […]
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ‘పెళ్ళిసందడి’ సినిమా చూసిన వాళ్ళు అందులోని స్వప్నసుందరి దీప్తి భట్నాగర్ ను అంత తేలికగా మర్చిపోరు. ఆ తర్వాత దీప్తి భట్నాగర్ పలు తెలుగు సినిమాలలో నటించినా, స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందలేకపోయింది. దాంతో బుల్లితెరలో కార్యక్రమాలు చేస్తూ బిజీ అయిపోయింది. అయితే ఈ 53 సంవత్సరాల మాజీ కథానాయిక ఇప్పటికీ సోషల్ మీడియాలో బిజీగానే ఉంటోంది. మరీ ముఖ్యంగా అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ చేస్తూ ఈ తరం కథానాయికలకు తానేమీ తీసిపోను […]
ప్రస్తుతం బాలీవుడ్ లోని టాప్ సింగర్స్ లో యమ బిజీగా ఉండేది నేహా కక్కర్ మాత్రమే. ఆమె సినిమా పాటలతో పాటూ ప్రైవేట్ వీడియో సాంగ్స్ ద్వారా కూడా మ్యూజిక్ లవ్వర్స్ కి దగ్గరైంది. నేహా రియాల్టీ షో జడ్జ్ గా కూడా ఆడియన్స్ కి హాట్ ఫేవరెట్. అయితే, ప్రజెంట్ మార్కెట్లో ఆమె నెట్ వర్త్ ఎంతో తెలుసా? వింటే ఆశ్చర్యపోతారు!నేహా కక్కర్ నెట్ వర్త్ 36 కోట్లట! ఓ వెబ్ పోర్టల్ లో వచ్చిన […]
ఆ మధ్య ‘తాండవ్’ వెబ్ సిరీస్ తతంగం గుర్తుంది కదా! హిందువుల పరమదైవం అయిన శివుడ్ని అవమానించారు. అందులోనే దళితుల్ని కూడా తక్కువ చేసి చూపారని ఆరోపణలు వచ్చాయి. దాంతో పోలీస్ కేసులు, కోర్టు విచారణలు జరిగాయి. ‘తాండవ్’ కాంట్రవర్సీ కేసు ఇంకా ముగిసిపోలేదు. కానీ,ఇప్పుడు మరో ‘గ్రహణం’ పట్టుకుంది…‘గ్రహణ్’ పేరుతో ఓ వెబ్ సిరీస్ వచ్చింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఇందిరా గాంధీ హత్య తరువాత దిల్లీలో సిక్కులపై జరిగిన […]
జగిత్యాల జిల్లాలో ఓ ప్రేమికుడు పెట్రోల్ బాటిల్‌తో పోలీస్ స్టేషన్ ముందు హల్‌చల్ చేశాడు. ఒంటిపై పెట్రోలు పోసుకుని దగ్గరకు వస్తే నిప్పంటించుకుని ఆత్మాహుతికి పాల్పడుతానని హెచ్చరించాడు. అరగంటపాటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. కరీంనగర్‌కు చెందిన యువతిని ప్రేమిస్తే ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారనిని ఆందోళన వ్యక్తం చేశాడు. జగిత్యాలకు చెందిన వెంకటరమణ ప్రేమ పేరుతో తమ కూతురును వేధిస్తున్నాడని యువతి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు వెంకటరమణను […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని.. హోంబలే ఫిలింస్ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందించనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కె.జి.యఫ్ చిత్రం తరహాలోనే సలార్ కూడా రెండు పార్టులుగా రానున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. కథను దృష్టిలో పెట్టుకుని రెండు […]