తెలంగాణ కాంగ్రెస్ కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. అధికార పార్టీనే లక్ష్యంగా విమర్శల పదును పెంచారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం లేని నీళ్ల వివాదాన్ని మరోసారి సృష్టించి.. రెండు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచి లబ్ది పొందాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ నీళ్ల నుండి నిప్పులు రాజేసి రావణ కాష్టంగా మార్చి కాచుకొగలడు. నీళ్లతో ఓట్లు కొల్లగొట్టడం కేసీఆర్ కి అలవాటు అని రేవంత్ రెడ్డి ఎద్దేవా […]
టాలీవుడ్ హీరో గోపీచంద్, నయనతార జంటగా నటించిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’.. మాస్ డైరెక్టర్ బి. గోపాల్ తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయినా.. కరోనా కారణంగా చిత్ర విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఓ దశలో ఓటీటీ బాట పడుతుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయడానికి నిర్మాత తాండ్ర రమేష్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. […]
దేశంలో డ్రగ్స్‌పై కఠినమైన నిబంధనలు వున్నా.. పోలీసులు అక్రమ డ్రగ్స్‌పై కొరఢా ఝులిపించినా.. ఇంకా అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. తాజాగా మహారాష్ట్రలో రూ. 879 కోట్ల విలువైన భారీ హెరాయిన్ ను అధికారులు పట్టుకున్నారు. ఇంత భారీ ఎత్తున డ్రగ్స్ సరఫరా అవుతుండటంతో పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. రాయ్ గఢ్ సమీపంలో ఈ హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రబ్ జోత్ సింగ్ అనే వ్యక్తి అరెస్ట్ చేశారు. ఇప్పటికే దేశంలో […]
బాలీవుడ్ స్టార్ కపుల్ ఆమిర్‌ఖాన్-కిరణ్‌రావు 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెబుతున్నట్లు శనివారం నాడు ఈ దంపతులు అధికారికంగా ప్రకటించారు. జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో నిన్నంతా అమిర్ ఖాన్ అంశం హాట్ టాపిక్ గా నడించింది. అయితే ఎప్పుడు ఎదో ఒక ట్వీట్ తో ఆన్లైన్ లో గడిపే వివాదాస్పద దర్శకుడు వర్మ కూడా ఆమిర్‌ఖాన్-కిరణ్‌రావు దంపతుల విడాకులపై స్పందించారు.ఆమిర్ ఖాన్ దంపతులు ఆనందంగా విడిపోతుంటే, […]
అడవి శేష్ ‘మేజర్’ సినిమాకు హిందీలో బంపర్ ఆఫర్ తగిలింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు క్రేజీ ఆఫర్ వచ్చింది. సాటిలైట్ రైట్స్ రూపంలో కోట్లు కొల్లగొట్టింది ‘మేజర్’ సినిమా.అడవి శేష్ టైటిల్ రోల్ లో తెరకెక్కుతోన్న ‘మేజర్’ మూవీ అమర జవాన్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందింది. ఆయన ‘26/11’ ముంబై ఉగ్ర దాడుల్లో దేశాన్ని రక్షిస్తూ ప్రాణ త్యాగం చేశాడు. మేజర్ ఉన్నికృష్ణన్ గా శేష్ […]
(ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి పుట్టిన రోజు సందర్భంగా) పండిత పామరులనే కాదు యువతరాన్ని సైతం తన సుస్వరాలతో అలరింపచేయడం కీరవాణికి వెన్నతో పెట్టిన విద్య. వీనుల విందైన రాగాన్నే పేరుగా పెట్టుకుని పెరిగిన కీరవాణిపై ఆయన తండ్రి కోడూరి శివశక్తి దత్త పెట్టుకున్న అంచనాలు ఇసుమంతైనా తప్పలేదు. ఇవాళ సంగీత జలధి మరకత మణి కీరవాణి జన్మదినం. 1961 జూలై 4న ఆయన జన్మించారు. సంగీతమంటే ప్రాణం పెట్టే శివశక్తి దత్త తనకిష్టమైన కీరవాణి రాగాన్నే […]
(నేడు నటి దివ్యవాణి పుట్టిన రోజు) అచ్చ తెలుగు కథానాయికలకు టాలీవుడ్ లో అవకాశాలు దక్కవనే అపప్రధను తోసిరాజని నటిగా గుర్తింపు తెచ్చుకుంది దివ్యవాణి. గుంటూరు జిల్లా తెనాలిలో పుట్టి ఆ పైన చెన్నయ్ చేరి సినిమాలలో అవకాశాలను అందిపుచ్చుకుంది. ‘సర్దార్ కృష్ణమ నాయుడు’లో హీరో కృష్ణ కుమార్తెగా నటించిన దివ్యవాణి… ఆ తర్వాత మరికొన్ని చిత్రాలలో నటించింది. ఆపైన కొద్ది కాలానికే హీరోయిన్ గా ఎదిగింది. ‘ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్’, ‘ఎదురింటి మొగుడు పక్కింటి […]
(జూలై 4 సత్యదేవ్ బర్త్ డే సందర్భంగా…) వైజాగ్ లో పుట్టి, విజయనగరంలో ఇంజనీరింగ్ చదివి, బెంగళూర్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేసి… హైదరాబాద్ లో నటుడిగా స్థిరపడ్డాడు సత్యదేవ్. అందరిలా అతను కేవలం నటుడు కాదు… విలక్షణ పాత్రలు చేస్తున్న సలక్షణ నటుడు. జూలై 4, 1989లో పుట్టిన సత్యదేవ్ ఇవాళ 33వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు. నటుడు కావాలనే కోరికతో తీవ్రమైన ప్రయత్నాలు చేసి, ఒకటి రెండు సినిమాల్లో ఇలా కనిపించి అలా […]
(జూలై 4 బర్త్ డే సందర్భంగా…) టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్ ఎవరైనా మొదటిసారి మెగా ఫోన్ చేతిలోకి తీసుకోబోతున్నాడంటే అతని తొలి ప్రాధాన్యం సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి! అలనాటి ప్రముఖ ఛాయాగ్రాహకుడు వి.ఎస్.ఆర్. స్వామి నుండి మెళకువల్ని నేర్చుకున్న ఎస్. గోపాల్ రెడ్డి అంటే వాళ్ళకు ఓ చెప్పలేని ధీమా. కొత్త వాళ్ళకే కాదు పాత తరం దర్శకులకూ ఎస్. గోపాల్ రెడ్డి ఓ దన్ను. అందుకే నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాటోగ్రాఫర్ గా అగ్రస్థానంలోనే […]
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఓటమి పాలైంది. మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా-బెతానీ మాటెక్ శాండ్స్ జోడీ రెండో రౌండ్లో పరాజయం పొందింది. ఇవాళ జరిగిన డబుల్స్ మ్యాచ్ లో రష్యా ద్వయం ఎలెనా వెస్నినా, వెరోనికా కుదెర్మెటోవా 6-4, 6-3తో సానియా, బెతానీ జోడీని ఓడించింది. ఈ ఓటమితో వింబుల్డన్ మహిళల డబుల్స్ లో సానియా పోరాటం ముగిసింది. ఇక ఆమె మిక్స్ డ్ డబుల్స్ లో తన […]