కరోనా-లాక్ డౌన్ అల్లు అరవింద్ ఓటీటీ ‘ఆహా’కి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఇందులో చాలా వరకు చిన్న సినిమాలు, సిరీస్‌లే. నిజానికి చాలా వరకూ డబ్బింగ్ సినిమాలే. ఇప్పటి వరకూ ఆహాలో రిలీజైన పెద్ద తెలుగు సినిమా ‘క్రాక్’ మాత్రమే. థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా రిలీజ్ అయిన పెద్ద సినిమాలు నిల్. ఇప్పుడు వరుసగా పేరున్న నటీనటులు, టెక్నీషియన్లతో వెబ్ సిరీస్ తీస్తూ… థియేట్రికల్ రిలీజ్ తర్వాత డిజిటల్ రిలీజ్‌కు కొన్ని పెద్ద సినిమాలను ఆహాలోకి […]
అమీర్ ఖాన్ సూపర్ హిట్ సినిమా ‘పికె’ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. పోస్టర్లో ఆమీర్ నగ్నంగా టేప్ రికార్డర్ అడ్డం పెట్టుకుని ఉన్న ఆ ఒక్క పోస్టర్ సినిమాపై ఎంతో హైప్ ని పెంచింది. ఇప్పుడు సంపూర్ణేష్ బాబు తాజా చిత్రం ‘క్యాలీఫ్లవర్’ కాన్సెప్ట్ పోస్టర్ PK ఫస్ట్ లుక్ ని గుర్తు చేస్తోంది. అసెంబ్లీ ముందు సంపూర్నేష్ కాలీఫ్లవర్ అడ్డుపెట్టుకుని నగ్నంగా నిలుచున్నపోస్టర్ ఇది. టాలీవుడ్‌లో ఎప్పుడూ తన సినిమాల ద్వారా […]
టాలీవుడ్ నటి మెహరీన్ పిర్జాదా ఇటీవల హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. త్వరలోనే పెళ్లి తేదీని ప్రకటిస్తుందనుకుంటే షాకింగ్ న్యూస్ ను చెప్పింది. తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు ట్విటర్ వేదికగా మెహరీన్ స్వయంగా లేఖ ద్వారా వెల్లడించింది. ఇక నుంచి భవ్య బిష్ణోయ్, అతని కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధం ఉండబోదని మెహరీన్ స్పష్టం చేసింది. ఇరువురు ఇష్టపూర్వకంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆమె తెలిపింది. […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ గత మూడేళ్ళుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. తను చివరగా కనిపించిన సినిమా ‘జీరో’. 2018లో ఈ సినిమా విడుదలైంది. అప్పటినుంచి అనుష్క ఏ కొత్త సినిమా అంగీకరించలేదు. 2020లో మాత్రం ఇండియన్ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్ లో నటిస్తుందనే ప్రకటన వచ్చింది. సోనీ సంస్థ 2020లో ఈ ప్రాజెక్ట్ ప్రకటించి టైటిల్ రోల్లో అనుష్క నటిస్తారని చెప్పింది. అయితే ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ […]
నటి యామీ గౌతమ్ ఇటీవలే దర్శకుడు ఆదిత్య ధర్‌ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు అనిరుధ్ రాయ్ చౌదరి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనుంది. త్వరలోనే తొలి షెడ్యూల్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. కోల్‌కతా నేపథ్యంలో సాగే విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమాలో యామీ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, సినిమా మొత్తం యామీ పాత్రపైనే ఎక్కువగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.కాగా, యామీ ఈరోజు మరోన్యూస్ తోను […]
మలయాళ సూపర్‌హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికలుగా నిత్యామీనన్, ఐశ్వర్యరాజేశ్‌లు ఖరారు అయినట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. సెకండ్ వేవ్ కంటే ముందు శరవేగంగా సాగిన ఈ చిత్ర షూటింగ్.. ఆ తరువాత వాయిదా పడింది. కాగా అతిత్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అంతేకాదు, ఈ చిత్ర […]
టాలీవుడ్ లో తాప్సీ కి ఉన్న ఇమేజ్ కు, బాలీవుడ్ లో ఉన్న ఇమేజ్ కు ఎంతో తేడా ఉంది. ఇక్కడ గ్లామర్ డాల్ గా గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ కొద్దికాలంగా ఉత్తరాదిన చేస్తున్న చిత్రాలను చూస్తే… ఆమెలోని నటిని మనవాళ్ళు సరిగా ఉపయోగించుకోలేదా? అనే సందేహం వస్తుంది. అయితే ‘ఆనందో బ్రహ్మ, గేమ్ ఓవర్’ వంటి సినిమాలతో ఇక్కడా ఆమె మంచి పాత్రలనే పొందిందనే భావన కలుగుతుంది. గత యేడాది ఫిబ్రవరిలో ‘థప్పడ్’ మూవీతో ప్రేక్షకుల […]
(జూలై 2 నటి గౌతమి పుట్టిన రోజు సందర్భంగా) విశాఖలో పుట్టి, బెంగళూరులో పెరిగింది అందాల గౌతమి. 1968 జూలై 2న జన్మించిన గౌతమి ఇవాళ 54వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఆమె ఫిల్మ్ కెరీర్ కు సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే సినిమా అవకాశాలు రావడంతో చిత్రసీమలో తన అదృష్టం పరీక్షించుకుంది గౌతమి. ‘దయామయుడు’ సినిమాలో సరదాగా కనిపించినా, పి.ఎన్. రామచంద్రరావు దర్శకత్వంలో శరత్ బాబు నిర్మించిన ‘గాంధీనగర్ రెండో […]
‘కె.జి.యఫ్’ లాంటి ఒక్క సినిమాతో హోంబలే ఫిలింస్ బ్యానర్ అగ్రస్థాయి బ్యానర్ గా నిలిచింది. ఈ సంస్థలో వచ్చే సినిమాలన్నీ కూడా బడా సినిమాలే కావటం విశేషం. ప్రతి సినిమాని పాన్ ఇండియా లెవల్ లో ప్లాన్ చేస్తోంది. కాగా, కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ హీరోగా సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. లూసియా, యూ టర్న్ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు పవన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. […]
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఇటీవలే అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన అమెరికా వెళ్ళినప్పటి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే, తాజాగా రజనీ అమెరికాలోని తన స్నేహితులలో కలిసి ఖుషిఖుషీగా మాట్లాడుతున్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రజనీ సంపూర్ణమైన ఆరోగ్యంతో కనిపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, రజనీ అమెరికాలోని అత్యుత్తమైన మాయో క్లినిక్‌లో ఇటీవల […]