హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతుంది. గడచిన 24 గంటల్లో తెలంగాణలో 1,08,954 కరోనా పరీక్షలు నిర్వహించగా, 848 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 98 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇటీవల కాలంలో గ్రేటర్ హైదరాబాదులో ఇదే తక్కువ. 1,114 మంది కరోనా నుంచి కోలుకోగా 6 గురు మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 6,26,085 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,09,947 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 12,454 మంది చికిత్స పొందుతున్నారు. […]
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ వెంట యాచకులు పడటంతో ఆమె కాసేపు ఇబ్బంది పడ్డారు. హెయిర్ సెల్యూన్ నుంచి తిరిగివస్తుండగా ఒక్కసారిగా ఆమెకు అడ్డుతగిలారు. అప్పటికే అక్కడ ఆమె కోసం ఎదురు చూస్తోన్న యాచకులు డబ్బు ఇవ్వాలంటూ వెంటపడ్డారు. ఏం చేయాలో ప్రగ్యాకు అర్థం కాలేదు. ఆమెను కదలనివ్వకుండా నిలబడ్డారు. బౌన్సర్స్ ఉన్నా కూడా ఏం చేయలేకపోయారు. ఎలాగోలా కారు ఎక్కే ప్రయత్నం చేసింది. కాగా, కారు డోర్ అద్దాలు పైకి ఎత్తకుండా వారు చేతులు పెట్టి అడ్డుకున్నారు. […]
పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తెలంగాణ నిరుద్యోగుల కల త్వరలోనే సాకారం కానుంది. పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. 19 వేల పైచిలుకు కానిస్టేబుల్ పోస్టులు.. 625 ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. పోలీస్ శాఖలో ఖాళీలను గుర్తించి ఆర్థిక శాఖకు నివేదిక పంపించారు డీజీపీ. ఆర్థిక శాఖ ఆమోదం రాగానే పోలీసు నియామకాలకు […]
తొందరపడి సినిమాలను ఓటీటీకి అమ్ముకోవద్దని నిర్మాతలకు తెలంగాణ ఎగ్జిబిటర్స్ సూచించారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్స్‌తో తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశం నిర్వహించింది. ఓటీటీ వేదికగా తమ సినిమాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న నిర్మాతలు జులై చివరినాటికి థియేటర్లు తెరచుకొనే అవకాశం ఉందని తెలిపారు. ఈలోగా ఓటీటీలకు సినిమాలు ఇవ్వొద్దని ఎగ్జిబిటర్లు తీర్మానించారు. అప్పటికీ థియేటర్లు తెరవకపోతే వారి ఆలోచనల ప్రకారం ఓటీటీలో సినిమాలు విడుదల చేసుకోవాలని కోరింది. నిర్మాతల మండలి నిర్ణయాన్ని […]
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని జానపాడు చెందిన శిరీష అంతరిక్షంలోకి అడుగు పెట్టబోతోంది. అంతేకాదు.. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు అమ్మాయిగానూ నిలిచింది. అంతరిక్షంలోకి వెళ్లనున్న నాలుగో భారతీయురాలిగా గుర్తింపును సొంతం చేసుకోనున్నారు. ఈ నెల 11వ తేదీన తెల్లవారు జామున ఈ స్పేస్‌క్రాఫ్ట్ నింగిలోకి దూసుకెళ్తుంది. ఆరుగురు పరిశోధకులతో కూడిన బృందంలో శిరీష ఒకరు. టీమ్‌లో ఆమెతో పాటు ఇంకొక మహిళ ఉన్నారు. కాగా శిరీషకు ప్రముఖులు అభినందనలు తెలుపుతూ టీమ్ సక్సెస్ అవ్వాలని […]
భారత ప్రభుత్వం తాజాగా చేసిన సినిమాటోగ్రఫీ సవరణ వల్ల భావ ప్రకటనా స్వేచ్ఛకు భారీ దెబ్బ తగలనుంది. దీనివల్ల 1952 నాటి సినిమాటోగ్రఫీ చట్టాన్ని అనుసరించి సెన్సార్ బోర్డ్ క్లీన్-చిట్ ఇచ్చిన చిత్రాలను తిరిగి కేంద్ర ప్రభుత్వం సినిమాలను రీఎగ్జామ్ చేసే అధికారం రానుంది. అంటేపరోక్షంగా సెన్సార్ బోర్డు నుండి క్లియరెన్స్ పొందిన ఏ చిత్రంనైనా నిషేధించటం లేదా చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఏర్పడుతుంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా వివిధ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు […]
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘మాస్టర్ పీస్’. అజయ్ వాసుదేవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2017లో విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాను ‘గ్రేట్ శంకర్’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు లగడపాటిశ్రీనివాస్. ఈ సినిమా టీజర్ ను శనివారం ఆది సాయికుమార్ విడుదల చేశారు. వరలక్ష్మి శరత్ కుమార్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా, పూనమ్ బజ్వా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ‘జనతా గ్యారేజ్’ ఫేమ్ […]
కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ప్రస్తుతం ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా షూటింగ్ మొదలెట్టేశాడు నాని. అంతేకాదు దాని తర్వాత మరికొన్ని ప్రాజెక్ట్ లను కూడా లైన్ లో పెట్టాడు. ఇంత బిజీటైమ్ లో కూడా నాని ప్రజల్లో కోవిడ్ అవేర్ నెస్ క్రియేట్ చేయటానికి తాపత్రయపడుతున్నాడు. గతనెలలో కోవిడ్ యుద్ధంలో వీరసైనికుల్లా పోరాడుతున్న డాక్టర్ల కోసం ఓపాటను విడుదల చేసిన నాని ఇప్పుడు కోవిడ్ మూడో వేవ్ పిల్లలను బలంగా తాకుతుందని బలంగా వినిపిస్తున్న తరుణంలో […]
బాలీవుడ్ స్టార్ కపుల్ ఆమిర్‌ఖాన్-కిరణ్‌రావు 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెబుతున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించారు. విడిపోవాలనుకోవడం అనేది ముగింపు కాదని, కొత్త ప్రయాణానికి ప్రారంభమని భావిస్తున్నాం అంటూ తమ లేఖలో ఆమిర్‌ఖాన్, కిరణ్‌రావు పేర్కొన్నారు. ఇకపై కుమారుడి బాధ్యత ఇద్దరూ చూసుకోనున్నట్లు తెలిపారు. మొదటి భార్య రీనా దత్తా నుంచి విడాకులు తీసుకున్న అనంతరం ఆమిర్‌ఖాన్.. కిరణ్‌రావుని ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఓ వర్గం వారిచ్చిన స్టేట్మెంట్స్ తో అర్థంచేసుకుంటుండగా.. మరికొందరు మాత్రం […]