భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఓటమి పాలైంది. మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా-బెతానీ మాటెక్ శాండ్స్ జోడీ రెండో రౌండ్లో పరాజయం పొందింది. ఇవాళ జరిగిన డబుల్స్ మ్యాచ్ లో రష్యా ద్వయం ఎలెనా వెస్నినా, వెరోనికా కుదెర్మెటోవా 6-4, 6-3తో సానియా, బెతానీ జోడీని ఓడించింది. ఈ ఓటమితో వింబుల్డన్ మహిళల డబుల్స్ లో సానియా పోరాటం ముగిసింది. ఇక ఆమె మిక్స్ డ్ డబుల్స్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.