స్టాండ్‌బై ప్లేయర్స్ లేకుండానే T20 World Cupకు టీమిండియా.. ఎందుకంటే..?
- 2026 టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టు ప్రకటన..
- టీ20 వరల్డ్ కప్‌కు స్టాండ్‌బై ప్లేయర్లను ఎంపిక చేయని బీసీసీఐ..
- వరల్డ్ కప్‌కు స్టాండ్‌బై ప్లేయర్స్ అవసరం లేదన్న బీసీసీఐ కార్యదర్శి సైకియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
No Standby Players: టీ20 వరల్డ్ కప్ 2026కకి 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఈరోజు బీసీసీఐ (డిసెంబర్ 20) ప్రకటించింది. ఈ జట్టు ఎంపికలో పలు కీలక నిర్ణయాలు చోటు చేసుకున్నాయి. వైస్ కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్‌తో పాటు వికెట్ కీపర్ జితేశ్ శర్మను జట్టు నుంచి తప్పించింది. గిల్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరమైన రింకూ సింగ్ ను మళ్లీ టీంలోకి రాగా, గాయంతో గత రెండు టీ20 మ్యాచ్‌లకు దూరమైన అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చి సూర్యకుమార్ కు డిప్యూటీగా బాధ్యతలు అందుకున్నాడు.
Read Also: China Mega Dam: భారత్ – చైనా మధ్య వాటర్ బాంబ్.. డేంజర్ జోన్‌లో ఇండియా!
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
అయితే, ఈసారి టీమిండియా సెలెక్టర్లు ఎవరినీ స్టాండ్‌బై ఆటగాళ్లను ప్రకటించకపోవడం విశేషం. సాధారణంగా ఐసీసీ టోర్నమెంట్‌లకు స్టాండ్‌బై ప్లేయర్లను ప్రకటించడం తప్పనిసరి అయినప్పటికీ, ఈసారి అలాంటి జాబితా మాత్రం భారత జట్టులో కనిపించలేదు.. దీనిపై స్పందించిన బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మీడియాతో మాట్లాడుతూ.. టోర్నమెంట్ మొత్తం మన దేశంలోనే జరుగుతోంది.. అవసరమైతే ఎప్పుడైనా ఆటగాళ్లను మార్చుకునే అవకాశం ఉంటుంది.. అందుకే స్టాండ్‌బై ప్లేయర్స్ అవసరం లేదని నిర్ణయించామని పేర్కొన్నారు.
Read Also: Hydra: నిజాం కాలం నాటి ‘బమ్రుక్నా ఉద్దౌలా’ చెరువుకు అభివృద్ధి పనులు వేగవంతం!
ఇక, ఈ వరల్డ్ కప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. లీగ్ దశలో పాకిస్థాన్‌తో మ్యాచ్ కోసం మాత్రమే భారత్ శ్రీలంకకు ప్రయాణించనుంది. కాగా, డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనున్న టీమిండియా ఫిబ్రవరి 7న ముంబై వాంఖడే స్టేడియంలో యూఎస్ఏతో తొలి మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 12న నమీబియాతో రెండో మ్యాచ్, ఫిబ్రవరి 15న కొలంబో ఆర్.ప్రేమదాస స్టేడియంలో పాకిస్థాన్‌తో హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 18వ తేదీన నెదర్లాండ్స్‌తో చివరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది. సెమీ ఫైనల్స్ మార్చి 4, 5 తేదీల్లో జరగగా, మార్చి 8న ఫైనల్ మ్యాచ్‌తో ఈ టోర్నీ ముగియనుంది.
🚨 SQUAD ALERT 🚨
Team India has announced a 15-member squad for the ICC #T20WorldCup 2026! 😮
Double tap ❤️ to wish India best of luck! 🇮🇳👏🏻
Watch Follow The Blues LIVE 👉 https://t.co/HCxHPl6kFs pic.twitter.com/yFHLmJZLCL
— Star Sports (@StarSportsIndia) December 20, 2025
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!