దేశంలో డ్రగ్స్‌పై కఠినమైన నిబంధనలు వున్నా.. పోలీసులు అక్రమ డ్రగ్స్‌పై కొరఢా ఝులిపించినా.. ఇంకా అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. తాజాగా మహారాష్ట్రలో రూ. 879 కోట్ల విలువైన భారీ హెరాయిన్ ను అధికారులు పట్టుకున్నారు. ఇంత భారీ ఎత్తున డ్రగ్స్ సరఫరా అవుతుండటంతో పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. రాయ్ గఢ్ సమీపంలో ఈ హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రబ్ జోత్ సింగ్ అనే వ్యక్తి అరెస్ట్ చేశారు. ఇప్పటికే దేశంలో డ్రగ్స్ దందాపై విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఇంత యథేచ్ఛగా డ్రగ్స్ నడుస్తుండటంతో అధికారులు మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. అరెస్ట్ అయినా వ్యక్తి నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టుకునే పనిలో అధికారులు వున్నారు.