Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Cinematographer S Gopala Reddy Birthday Special

పాత – కొత్త తరాల వారధి ఎస్. గోపాల్ రెడ్డి

Published Date :July 4, 2021 , 12:19 am
By ramakrishna
పాత – కొత్త తరాల వారధి ఎస్. గోపాల్ రెడ్డి
  • Follow Us :
  • google news
  • dailyhunt

(జూలై 4 బర్త్ డే సందర్భంగా…)

టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్ ఎవరైనా మొదటిసారి మెగా ఫోన్ చేతిలోకి తీసుకోబోతున్నాడంటే అతని తొలి ప్రాధాన్యం సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి! అలనాటి ప్రముఖ ఛాయాగ్రాహకుడు వి.ఎస్.ఆర్. స్వామి నుండి మెళకువల్ని నేర్చుకున్న ఎస్. గోపాల్ రెడ్డి అంటే వాళ్ళకు ఓ చెప్పలేని ధీమా. కొత్త వాళ్ళకే కాదు పాత తరం దర్శకులకూ ఎస్. గోపాల్ రెడ్డి ఓ దన్ను. అందుకే నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాటోగ్రాఫర్ గా అగ్రస్థానంలోనే ఉన్నారాయన. 1951 జూలై 4న జన్మించిన ఎస్. గోపాల్ రెడ్డి పుట్టిన రోజు ఇవాళ. ఆ సందర్భంగా ఆయన కెరీర్ ను ఓసారి పరిశీలిద్దాం.
కృష్ణాజిల్లాలో జన్మించిన ఎస్. గోపాల్ రెడ్డికి మొదటి నుండి చదువు పట్ల పెద్దంత ఆసక్తిలేదు. దాంతో యుక్తవయసులోనే తండ్రి సహకారంతో ఆయన స్నేహితుడు సి. నాగేశ్వరరావు దగ్గర అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా చేరారు. ఆ తర్వాత ఆరేడు నెలల్లోనే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వి.ఎస్.ఆర్. స్వామి చెంతకు చేరడంతో ఎస్. గోపాల్ రెడ్డి కెరీర్ గాడిలో పడింది. ఆయన దగ్గర తొమ్మిది సంవత్సరాలు శిష్యరికం చేసి, 1978లో కె.సి. శేఖర్ బాబు తీసిన ‘సంసార బంధం’తో సినిమాటోగ్రాఫర్ గా మారిపోయారు ఎస్. గోపాల్ రెడ్డి. తొలి చిత్రం పెద్దంత పేరు తెచ్చిపెట్టకపోయినా ఆ తర్వాత చేసిన ‘గూటిలోని రామచిలక’, ‘గోపాలరావుగారి అమ్మాయి’ సినిమాలు ఆయనకంటూ ఓ గుర్తింపును తెచ్చిపెట్టాయి.

ప్రముఖ రచయిత జంధ్యాల తొలిసారి మెగాఫోన్ చేతిలోకి తీసుకుని ‘ముద్దమందారం’ సినిమా తీస్తూ, ఎస్. గోపాల్ రెడ్డినే కెమెరామ్యాన్ గా పెట్టుకున్నారు. ఈ సినిమా నటీనటులకే కాదు సాంకేతిక నిపుణులకూ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దాంతో తొలిసారి దర్శకత్వం వహించే యువకులందరికీ ఎస్. గోపాల్ రెడ్డి ఓ సెంటిమెంట్ గా మారిపోయారు. తన కెరీర్ లో పాతిక మంది కొత్త దర్శకుల చిత్రాలకు గోపాల్ రెడ్డి సేవలు అందించారు. రామ్ గోపాల్ వర్మ, బి. గోపాల్, ఎ.ఎం. రత్నం, దశరథ్, వి.ఎన్. ఆదిత్య, జి. రామ్మోహనరావు, పరుచూరి మురళీ, కొండా, మిలన్ లూద్రియా, శ్రీప్రియ, హేమంత్ మధుకర్ తదితరుల తొలి చిత్రాలకు ఆయనే పనిచేశారు. కేవలం తెలుగులోనే కాదు… హిందీలోనూ ఎస్. గోపాల్ రెడ్డి తన సత్తా చాటారు. ‘న్యాయం కావాలి’ చిత్రాన్ని హిందీలో ‘ముఝే ఇన్సాఫ్ చాహియే’గా పునర్ నిర్మిస్తూ, అట్లూరి పూర్ణ చంద్రరావు… ఎస్. గోపాల్ రెడ్డిని బాలీవుడ్ కు తీసుకెళ్ళారు. అక్కడ అమితాబ్ నటించిన మూడు చిత్రాలతో పాటు దాదాపు డజను సినిమాలకు గోపాల్ రెడ్డి వర్క్ చేశారు.

ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా ‘ఆనంద భైరవి’, ‘క్షణక్షణం’ ‘హలో బ్రదర్’ చిత్రాలకు నంది అవార్డ్ అందుకున్నారు. విశేషం ఏమంటే 2011లో నంది అవార్డుల కమిటీ ఛైర్మన్ గానూ వ్యవహరించారు. కేవలం సినిమాటోగ్రఫీకే పరిమితం కాకుండా మిత్రుడు కె. ఎల్. నారాయణతో కలిసి దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో ఆరు చిత్రాలు నిర్మించారు. త్వరలో మహేశ్ బాబు – రాజమౌళి కాంబినేషన్ లో సినిమా నిర్మించబోతున్నారు. నిజానికి చాలా కాలం క్రితమే బాలకృష్ణ హీరోగా జంధ్యాల దర్శకత్వంలో మిత్రులతో కలిసి ‘బాబాయ్ అబ్బాయ్’ సినిమాను ఎస్ గోపాల్ రెడ్డి నిర్మించారు. అలా జంధ్యాల దర్శకత్వం వహించిన 11 చిత్రాలకు ఎస్. గోపాల్ రెడ్డి ఛాయాగ్రాహకుడిగా ఉన్నారు. ఎం.వి. రఘు, రసూల్, విజయ్ కుమార్, సమీర్ రెడ్డి, స్వర్గీయ శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా ఎస్. గోపాల్ రెడ్డి దగ్గర శిష్యరికం చేసిన వారే. ఎస్. గోపాల్ రెడ్డి తనయుడు సందీప్ సైతం ఇప్పుడు తండ్రి బాటలోనే సాగుతున్నాడు. విశేషం ఏమంటే… దర్శకత్వంపై ఆసక్తి, అనురక్తి ఉన్న గోపాల్ రెడ్డి… రవితేజ హీరోగా ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ మూవీని తెరకెక్కించారు. కానీ ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. దాంతో మళ్ళీ దర్శకత్వం వైపుకు పోలేదు. సినిమాటోగ్రాఫర్ గా మాత్రం కొనసాగుతున్నారు. సినిమాటోగ్రఫీ రంగంలో డిజిటలైజేషన్ కారణంగా వచ్చిన సరికొత్త సాంకేతికతను సైతం అర్థం చేసుకుని ఈ తరం కెమెరామేన్లతోనూ పోటీ పడుతూ తన సత్తా చాటుతున్నారు ఎస్. గోపాల్ రెడ్డి. ఉత్తమాభిరుచిగల సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి సేవలు చిత్రసీమకు మరింత కాలం దక్కాలని కోరుకుందాం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Cinematographer S.Gopala Reddy
  • S.Gopala Reddy
  • S.Gopala Reddy Birthday

తాజావార్తలు

  • Strait of Hormuz: ట్రంప్ బెదిరింపులు.. ఇరాన్ దూకుడు.. 24 గంటల్లోపే మళ్లీ హార్మూజ్ మూసివేత

  • Simhachalam Chandanotsavam Tickets Row: సింహాచలం చందనోత్సవం టిక్కెట్లపై గందరగోళం

  • SRH vs CSK: ఉప్పల్‌ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్.. సీఎస్‌కేలో రెండు మార్పులు, ఫ్యాన్స్‌కు మాత్రం నిరాశ తప్పదు!

  • CM Revanth Reddy : ముసుగు రాజకీయాలు వద్దు.. మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయండి

  • Smriti Irani: మహిళల హక్కులు హరించి సంబరాలా? కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్

ట్రెండింగ్‌

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions