బాలీవుడ్ స్టార్ కపుల్ ఆమిర్‌ఖాన్-కిరణ్‌రావు 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెబుతున్నట్లు శనివారం నాడు ఈ దంపతులు అధికారికంగా ప్రకటించారు. జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో నిన్నంతా అమిర్ ఖాన్ అంశం హాట్ టాపిక్ గా నడించింది. అయితే ఎప్పుడు ఎదో ఒక ట్వీట్ తో ఆన్లైన్ లో గడిపే వివాదాస్పద దర్శకుడు వర్మ కూడా ఆమిర్‌ఖాన్-కిరణ్‌రావు దంపతుల విడాకులపై స్పందించారు.
ఆమిర్ ఖాన్ దంపతులు ఆనందంగా విడిపోతుంటే, వారికి లేని బాధ ఈ ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్లకి ఎందుకని వర్మ ట్వీట్ చేశారు. ఈ నిర్ణయంతో వారు భవిష్యత్తులో వ్యక్తిగత జీవితాల్లో ఎంతో సంతోషంగా ఉంటారని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తన దృష్టిలో వివాహం అనేది మూర్ఖత్వమని, అది అజ్ఞానంతో ముడిపడి ఉందని అన్నారు. విడాకులు అనేది మాత్రం జ్ఞానం, తెలివితో ముడిపడి ఉన్న విషయమని చెప్పారు. వివాహం చేసుకోవడం కంటే విడాకులు తీసుకున్నప్పుడే అధికంగా సెలబ్రేట్ చేసుకోవాలని వర్మ తెలిపారు. కాగా, నిన్న పెద్దఎత్తున అమిర్ ఖాన్ పై ట్రోల్స్ నడవడంతో వర్మ ఈవిధంగా స్పందించారు.