‘అలా అమెరికాపురములో’… థమన్ తన టీమ్ తో సందడి చేయబోతున్నాడు. ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ వరుస కచేరిలతో ఎన్నార్ లను అలరించనున్నాడు. ఇటువంటి మ్యూజికల్ టూర్స్ బాలీవుడ్ సంగీత దర్శకులు, గాయకులకు మామూలే. మన వాళ్లు చాలా తక్కువగా విదేశాల్లో మ్యూజికల్ కన్సర్ట్స్ ప్లాన్ చేస్తుంటారు. పైగా గత కొద్ది రోజులుగా కొనసాగుతోన్న కరోనా కల్లోలం పరిస్థితుల్ని మరింత కఠినతరంగా మార్చేసింది. అయినా, యూఎస్ లో నెలకొంటోన్న సాధారణ పరిస్థితుల దృష్ట్యా త్వరలోనే […]
టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హరియాణా మాజీ సీఎం భజన్ లాల్ బిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్‌తో పెళ్లి రద్దు చేసుకున్నానని తెలపడంతో అభిమానులంతా షాక్ కు గురైయ్యారు. దీంతో సోషల్ మీడియాలో ఆమె ఫ్యాన్స్ భవ్య బిష్ణోయ్, అతని కుటుంబానికి వ్యతిరేకంగా ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. ఆ కుటుంబాన్ని నిందిస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, భవ్య బిష్ణోయ్ కుటుంబం రాజకీయ నేపథ్యం వున్నా కుటుంబం కావడంతో హేళన చేస్తూ ఇతర పార్టీల కార్యకర్తలు […]
ఆమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్. అప్పట్లో వరుసగా సినిమాలు చేశాడు. కరీనా కపూర్ లాంటి బాలీవుడ్ టాప్ బ్యూటీతోనూ తెరపై రొమాన్స్ చేశాడు. కానీ, ఎందుకో తిరిగి విదేశాలకు వెళ్లిపోయాడు. మళ్లీ బాలీవుడ్ చిత్రాల్లో కనిపిస్తాడన్న ఆశ కూడా లేదు. అయితే, ఆయన చిన్నపాటి బిగ్ స్క్రీన్ కెరీర్ లో ‘ఢిల్లీ బెల్లి’ పెద్ద సంచలనం!అభినయ్ డియో డైరెక్షన్ లో రూపొందింది ఇమ్రాన్ ఖాన్ స్టారర్ ‘ఢిల్లీ బెల్లి’. దేశ రాజధానిలో జరిగే ఈ సినిమా […]
విక్టరీ వెంకటేశ్ గారాల పట్టి ఆశ్రిత దగ్గుబాటి. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఆమె రికార్డ్ సృష్టించారు. వెంకటేశ్ పెద్ద కూతురైన ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ‘ఇన్ఫినిటీ ప్లాటర్’ పేరుతో ఓ అకౌంట్ రన్ చేస్తారు. దాంట్లో రెగ్యులర్ గా రుచికరమైన రెసిపీస్ పోస్ట్ చేస్తుంటారు. వాటి కోసం ఆశ్రితని ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా పెద్దదే! లక్షకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు దగ్గుబాటి వారి టాలెంటెడ్ షెఫ్ కి!ఆశ్రిత ఇన్ స్టాగ్రామ్ లోని […]
హుజారాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈటలను రకరకాలుగా రాజకీయ కక్షతో వేధిస్తున్నారని.. అక్రమంగా జైల్లో ఉంచినా ఈటలను హుజురాబాద్ లో గెలిపిస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంచి, నీతివంతమైన, కమీషన్లు లేని, ప్రజల ప్రజాస్వామ్య ప్రభుత్వం బీజేపీ ఇస్తుందన్నారు. హుజురాబాద్ ఎన్నికలను ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న ఎన్నికలుగా భావిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు, అవకాశ వాదులకు మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు. ప్రజాస్వామ్యానికి, అప్రజాస్వానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రజలు, […]
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం చనుగొండ్ల గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకుడు గోపాల్ ఆత్మహత్య తనను తీవ్రంగా కలచివేసిందని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు. అతని తల్లిదండ్రులు స్తోమత లేకపోయినా రెక్కల కష్టంతో గోపాల్ ను ఉన్నత చదువులు చదివించారని తెలిపారు. రెండేళ్ల పాటు జాబ్ క్యాలెండర్ కోసం ఎదురుచూసిన గోపాల్, తనకు ఉద్యోగం లేదని మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయం మరే ఇతర […]
నోటి దాకా వచ్చిన ముద్ద నోట్లోకి వెళ్లకపోవటం అంటే ఏంటో… పాపం నోరాకి తాజాగా తెలిసి వచ్చిందంటున్నారు… బాలీవుడ్ జనాలు! ఆమె నోటిదాకా వచ్చిన ఓ ముద్దొచ్చే క్యారెక్టర్ చివరి నిమిషంలో చేజారిపోయిందట! ఇంతకీ, విషయం ఏంటంటే…టైగర్ ష్రాఫ్ టైటిల్ రోల్ లో దర్శకుడు వికాస్ బాల్ ‘గణ్ పత్’ అనే సినిమా రూపొందించబోతున్నాడు. రెండు భాగాలుగా ఈ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. పార్ట్ వన్ అండ్ టూ రెండిట్లోనూ కృతీ సనోన్ హీరోయిన్ గా […]
చకచకా సినిమాలు చేస్తూ హిందీ సినిమా రంగంలో యమ జోరు మీద ఉంది తాప్సీ పన్ను. ఇప్పటికే ఆమె ప్రధాన పాత్రలో పలు చిత్రాలు ప్రకటించారు. తాజాగా మరో సినిమాలో తాప్సీ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధం అవుతోంది. పైగా ఈ నెల 20వ తేదీ నుంచే సదరు సినిమా మొదలు పెట్టబోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ తరువాత తాప్సీ రష్యాలో వెకేషన్ కు వెళ్లింది. ఆమె కొంత గ్యాప్ తరువాత కెమెరా ముందుకు […]
నెల్లూరు జిల్లాలోని గూడూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుండి రాజమండ్రికి వెళ్తుండగా లారీ-కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులు వీరయ్య, వరలక్ష్మీ, మణికంఠ, స్వాతిలుగా ఉన్నారు. లిఖిత (16) అనే యువతికి తీవ్ర గాయాలు కాగా, నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. ఈ జాతీయ రహదారిపై కొంతకాలంగా బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది, దీంతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ జరిగిన […]