కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో జూలై 23 నుండి సినిమాలు విడుదల కావడం మొదలైంది. ఆ శుక్రవారం ‘నేరగాడు’ అనే తమిళ డబ్బింగ్ మూవీ విడుదలైతే, జూలై 30న ‘తిమ్మరుసు’లో కలిపి ఐదు చిత్రాలు విడుదలయ్యాయి. అయితే ‘తిమ్మరుసు’ మూవీ మాత్రమే ఫర్వాలేదనిపించింది. ఇక ఆగస్ట్ ఫస్ట్ వీకెండ్ లో డబ్బింగ్ తో కలిసి ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. విశేషం ఏమంటే… ఇందులో ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ సూపర్ హిట్ అయిపోయింది. […]
మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేస్తుండటంతో ఈసారి ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా నటి హేమకు ‘మా’ క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌పై చేసిన ఆరోపణలకు వివరణ కోరుతూ హేమకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.మా ఎన్నికలు జరకుండా చేసి, అధ్యక్షుడిగా కొనసాగాలని నరేష్ పావులు కదుపుతున్నారని ఆమె ఆరోపించింది. అంతేకాక ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ నటి హేమ […]
ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అతడు, ఆమె – ప్రియుడు” సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రముఖ నటుడు బెనర్జీ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సీనియర్ నటుడిగా ఎన్నో భిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించిన ఆయన ఈ చిత్రంలో హీరోగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో బెనర్జీ ఒక ఆస్ట్రోనమి ప్రొఫసర్ గా నటిస్తున్నాడు. ఇదొక బ్లాక్ హ్యూమర్ థ్రిల్లర్ సస్పెన్స్ సినిమా. ఈ చిత్రం షూటింగ్ పూర్తికావడంతో, పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు ప్రారంభమయ్యయి. సునీల్, […]
మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘గత రెండు రోజులుగా నీరసంగా ఉంటే కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. చాలా స్వల్ప లక్షణాలతో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వెంటనే గాంధీ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని డిశ్చార్జ్ అయ్యాను. నాతో అతి దగ్గరగా తిరిగిన వ్యక్తులు ఐసోలేషన్‌లో ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.కాగా, నల్లగొండ ఎన్‌జీ […]
హీరో శ్రీ విష్ణు, ‘బాణం’ ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భళా తందనాన’. దీనిని సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ జరపాలని ప్లాన్ చేశారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్ లో మొదలైంది. శ్రీ విష్ణు సరసన క్యాథరిన్ ట్రెసా […]
‘ఉప్పెన’తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్! తొలి చిత్రం విడుదలకు ముందు క్రిష్ దర్శకత్వంలో ‘కొండపొలం’ నవల ఆధారంగా రెండో సినిమాను చేశాడు వైష్ణవ్ తేజ్. ఆ మూవీ విడుదలకు ముందే మరో రెండు, మూడు సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో ఒకటి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా. ఈ యేడాది ఏప్రిల్ 2న ఈ సినిమా పూజా […]
ఆగస్ట్ 9న సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ‘సర్కారు వారి పాట’ నుంచి బర్త్ డే బ్లాస్టర్ విడుదలై రికార్డ్ వ్యూస్ కొల్లగొట్టింది. ఇక పుట్టిన రోజున సినీ రాజకీయరంగ ప్రముఖుల శుభాకాంక్షలతో తడిచి ముద్దయ్యాడు మహేశ్. అదే రోజు సాయంత్ర ఏడు గంటలకు ట్విట్టర్ స్పేసెస్ లో లైవ్ సెక్షన్ నడిచింది. మహేశ్ టీమ్ నిర్వహించిన ఈ లైవ్ సెషన్ లో మహేశ్ తో పని చేసిన దర్శక, నిర్మాతలు , […]
అందాల తార, స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి కుమార్తె అర్హ బుల్లి భరతుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిన్నారికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన ‘శాకుంతలం’ చిత్ర బృందం అంతే ఘనంగా వీడ్కోలు పలికింది. విశేషం ఏమంటే… అల్లు అర్జున్ తన కుమార్తె కోసం అత్యంత ఖరీదైన వ్యానిటీ వ్యాన్ ఫాల్కన్ ను కొద్ది రోజుల పాటు ఆమెకే కేటాయించాడు. […]
మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ‘సర్కారు వారి పాట’ బర్త్ డే బ్లాస్టర్ యు ట్యూబ్ ను షేక్ చేసింది. సర్కారు వారి బ్లాస్టర్ అభిమానులనే కాదు.. సాధారణ ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది. దీంతో టాలీవుడ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలైన 24 గంటల్లో 25.7 మిలియన్ వ్యూస్ సాధించి మొదటి స్థానంలో నిలిచింది. అలాగే 754K లైక్స్ కూడా రాబట్టడం విశేషం. కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో […]
లవ్వర్ కు గిఫ్ట్ ఇచ్చేందుకే దొంగగా మారాడు ఓ యువకుడు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో నిన్న జి.కె జ్యూవెలరీలో ఒడిశాకు చెందిన సూరజ్ కుమార్ కద్రకా చోరీకి పాల్పడ్డాడు. జ్యూవెలరీ షాప్ లోని వర్కర్స్ ను డమ్మీ పిస్తోల్ తో బెదిరించి మూడు గోల్డ్ చెయిన్స్ చోరీ చేశాడు. చోరీ చేసి పారిపోతుండగా స్థానికులు పట్టుకొని.. పోలీసులకు అప్పగించారు. పోలీస్ విచారణలో లవ్వర్ కు గిఫ్ట్ ఇచ్చేందుకే చోరీ చేశానని సూరజ్ కుమార్ అంగీకరించాడు. చోరీ కోసం […]