మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ‘సర్కారు వారి పాట’ బర్త్ డే బ్లాస్టర్ యు ట్యూబ్ ను షేక్ చేసింది. సర్కారు వారి బ్లాస్టర్ అభిమానులనే కాదు.. సాధారణ ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది. దీంతో టాలీవుడ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలైన 24 గంటల్లో 25.7 మిలియన్ వ్యూస్ సాధించి మొదటి స్థానంలో నిలిచింది. అలాగే 754K లైక్స్ కూడా రాబట్టడం విశేషం. కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ‘సర్కారు వారి పాట’ను మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కాబోతుంది.
నిజానికి ఈ బ్లాస్టర్ మహేశ్ బాబు పుట్టిన రోజు కానుకగా ఆగష్టు 9 ఉదయం 9 గంటల 9 నిమిషాలకు విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కానీ అనుకున్న టైమ్ కంటే తొమ్మిది గంటలు ముందుగా అర్ధరాత్రి టీజర్ ఆన్‌లైన్‌లో దర్శనం ఇవ్వడంతో బేజారైన యూనిట్ చేసేది ఏమీ లేక ప్రకటించిన టైమ్ కంటే ముందే అర్థరాత్రి 12:30 గంటలకు అధికారికంగా విడుదల చేసింది. అయితే టీజర్ ముందుగానే లీక్ కావడాన్ని యూనిట్ సీరియస్‌గా తీసుకుని… ఈ పని ఇంటి దొంగలే చేసి ఉంటారని అనుమానిస్తూ, చేసింది ఎవరో కనిపెట్టే ప్రయత్నాల్లో ఉంది. అంతేకాదు దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కూదా ఫిర్యాదు చేసింది. మరి బ్లాస్టర్ లీక్ ఇంటి దొంగల పనా? లేకా వేరే ఎవరైనా చేశారా? అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా అనుకున్నటైమ్ కంటే ముందే రిలీజ్ చేసినా రికార్డ్ వ్యూస్ దక్కించుకోవడం విశేషమే. మహేశ్ ఫ్యాన్సా… మజాకా!?