బిగ్ బాస్ ఫేమ్ అర్చన టైటిల్ రోల్ పోషించిన సినిమా ‘అవలంబిక’. సుజయ్, మంజూష పొలగాని ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను రాజశేఖర్ దర్శకత్వంలో జి. శ్రీనివాస్ గౌడ్ నిర్మించారు. సోషియో ఫాంటసీ హారర్ చిత్రంగా దర్శకుడు దీనిని మలిచాడని, అన్ని కార్యక్రమాలు పూర్తి అయిన ఈ సినిమాను ఇదే నెల 20న విడుదల చేయబోతున్నామని నిర్మాత శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇటీవల నాగబాబు మూవీ ట్రైలర్ ను విడుదల చేశారని, దానికి మంచి […]
జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ కాలికి గాయమైంది. పొరపాటున జారి పడటంతో కాలికి చిన్నపాటి ఫ్యాక్చర్ అయ్యిందని స్వయంగా ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. మిత్రుడు డాక్టర్ గురవారెడ్డి చేత సర్జరీ చేయించుకోవడానికి విమానంలో హైదరాబాద్ కు బయలు దేరినట్టు ప్రకాశ్ రాజ్ చెప్పారు. కంగారు పడాల్సింది ఏమీ లేదని, తాను బాగానే ఉన్నానని ప్రకాశ్ రాజ్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలను వచ్చే నెల రెండోవారం […]
(ఆగస్టు 10తో ‘నువ్వు-నేను’కు 20 ఏళ్ళు) తొలి ప్రయత్నంగా దర్శకుడు తేజ రూపొందించిన ‘చిత్రం’ అప్పట్లో యువతను విశేషంగా ఆకట్టుకొని సంచలన విజయం సాధించింది. ఆ చిత్ర కథానాయకుడు ఉదయ్ కిరణ్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించి పెట్టింది. తరువాత ఉదయ్ కిరణ్ హీరోగా తేజ రూపొందించిన చిత్రం ‘నువ్వు-నేను’. ఇందులోనూ ప్రేమకథనే తీసుకొని మరోమారు యువతను రంజింప చేస్తూ అంతకు మించిన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు తేజ. ఈ చిత్రంతో […]
(ఆగస్టు 10తో ‘దిల్ చాహ్ తా హై’కి ఇరవై ఏళ్ళు పూర్తి) ఒకప్పుడు ఫర్హాన్ అఖ్తర్ అంటే జావేద్ అఖ్తర్ తనయుడు అనే గుర్తింపు ఉండేది. ఇప్పుడు ఫర్హాన్ తండ్రి జావేద్ అనేలా పేరు సంపాదించాడు. నటునిగా, దర్శకునిగా జనం మదిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించిన ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘దిల్ చాహ్ తా హై’. 2001 ఆగస్టు 10న విడుదలైన ఈ చిత్రం ఆ రోజుల్లో యువతను విశేషంగా […]
విభిన్నమైన కథా చిత్రాల దర్శకుడు దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘రిపబ్లిక్’. మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించగా.. ఐశ్వర్య రాజేశ్ కథానాయికగా నటించింది. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలకమైన పాత్రలను పోషించారు. కాగా, తాజాగా జగపతిబాబును ‘దశరథ్’ పాత్రలో పరిచయం చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో జగ్గుభాయ్ లుక్ చాలా సాఫ్ట్ గా కనిపిస్తోంది. ‘దీపాలు పోరాటం ఆపినప్పుడే చీకటి గెలుస్తుంది’ అనే క్యాప్షన్ ను పోస్టర్ […]
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో “జోగి”, “రాజ్ ద షో మ్యాన్”, “ద విలన్” వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు ప్రేమ్. దర్శకుడిగానే కాక గాయకుడిగా, గీత రచయితగా మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా శాండల్ వుడ్ లో పేరు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో మరో భారీ ప్యాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోంది. ‘పీ9’ వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ సోమవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. విభిన్న కథలతో భారీ బడ్జెట్ […]
నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘సర్కారు వారి పాట’ నుంచి విడుదల చేసిన ‘బ్లాస్టర్’ టీజర్ ఆకట్టుకుంటుంది. తక్కువ టైమ్ లోనే యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ రాబట్టుకొంటుంది. ఇదిలావుంటే, ఈ టీజర్ దాదాపు తొమ్మిది గంటలు ముందుగానే అర్ధరాత్రి ఆన్లైన్ లో దర్శనం ఇచ్చింది. విడుదల సమయానికి కంటే ముందే అభిమానులందరికి చేరిపోవడంతో చిత్రయూనిట్ అంత కంగుతిన్నారు. దీంతో చేసేది ఏమిలేక ‘సర్కారు వారి పాట’ టీజర్ ను ముందుగానే విడుదల […]
తమిళ నటి, బిగ్ బాస్ ఫేం మీరా మిథున్‌ను చెన్నై పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు. కోలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి షెడ్యూల్ కులాలకు చెందిన దర్శకులు, నటులను గెంటేయాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఓ దర్శకుడు తన అనుమతి లేకుండా తన ఫోటోను సినిమా ఫస్ట్ లుక్ కోసం ఉపయోగించాడని ఆరోపిస్తూ షెడ్యూల్డ్ కులాలకు వ్యతిరేకంగా అవమానకరమైన పదాలను ఉపయోగించింది. ‘తక్కువ జాతి అనగా దళిత సామాజిక వర్గానికి […]
‘పుష్ప’ ‘భరతుడ్ని’ కలిశాడు! ఎక్కడా అంటారా? ‘శాకుంతలం’ సెట్స్ మీద! అల్లు అర్జున్, అల్లు అర్హా ఒకే లొకేషన్ లో తమ తమ సినిమాల కోసం షూట్ చేస్తుండటంతో బన్నీ కూతురు వద్దకి తరలి వచ్చాడు. అల్లు వారసురాలు ‘భరతుడి’ గెటప్ లో కెమెరా ముందు నటిస్తుంటే స్వయంగా ఐకాన్ స్టార్ చూసి మురిసిపోయాడు!‘శాకుంతలం’ మూవీలో సమంత టైటిల్ రోల్ పోషిస్తోంది. అర్హా రాజకుమారుడు భరతుడుగా అలరించనుంది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న పౌరాణికం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ […]