ధనుష్ రికార్డ్ కి ఆమడ దూరంలో మహేశ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్ట్ 9న సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ‘సర్కారు వారి పాట’ నుంచి బర్త్ డే బ్లాస్టర్ విడుదలై రికార్డ్ వ్యూస్ కొల్లగొట్టింది. ఇక పుట్టిన రోజున సినీ రాజకీయరంగ ప్రముఖుల శుభాకాంక్షలతో తడిచి ముద్దయ్యాడు మహేశ్. అదే రోజు సాయంత్ర ఏడు గంటలకు ట్విట్టర్ స్పేసెస్ లో లైవ్ సెక్షన్ నడిచింది. మహేశ్ టీమ్ నిర్వహించిన ఈ లైవ్ సెషన్ లో మహేశ్ తో పని చేసిన దర్శక, నిర్మాతలు , సాంకేతిక నిపుణులు పలువురు పాల్గొన్నారు. ప్రదీప్ యాంకర్ గా వ్యవహరించిన ఈ ట్విటర్ స్పేస్ లైవ్ ను మహేశ్ టీమ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏకంగా ధనుష్ రికార్డ్ పై కన్నేసింది. ఎందుకంటే గతంలో నిర్వహించిన ట్విటర్ స్పేస్ లైవ్ లో ధనుష్ దే రికార్డ్. దక్షిణాదిన 28 వేల వ్యూయర్స్ తో ధనుష్ ట్విటర్ స్పేస్ లైవ్ లో తొలి స్థానంలో ఉన్నాడు. ఇటీవల పుట్టిన రోజు సందర్భంగా ఈ రికార్డ్ సాధించారు ధనుష్ అభిమానులు. మహేశ్ లాగే ధనుష్ పుట్టిన రోజున కూడా తనతో పని చేసిన దర్శకులు, నటీనటులు ఆ లైవ్ లో పార్టిసిపేట్ చేశారు.
ఇక మహేశ్ లైవ్ విషయానికి వస్తే అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ ట్విటర్ లైవ్ లో పాల్గొన్నారు. దాదాపు 14 వేల మంది ఈ లైవ్ లో పార్టిసిపేట్ చేయటం విశేషం. టాలీవుడ్ కి సంబంధించి ట్విటర్ స్పేస్ లో ఇదే రికార్డ్. బర్త్ డే బ్లాస్టర్ 24 గంటల్లో 25.7 మిలియన్ వ్యూస్ తో పాటు 754K లైక్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసినా… ట్విటర్ స్పేస్ లో మాత్రం ధనుష్ రికార్డ్ కి ఆమడ దూరంలోనే నిలిచారు మహేశ్. ధనుష్ లైవ్ స్పేస్ లో 28 వేల మంది పార్టిసిపేట్ చేయగా… మహేశ్ ట్విట్టర్ స్పేస్ లో మాత్రం 14 వేల మంది మాత్రమే పాల్గొన్నారు. మరి మనుముందు టాలీవుడ్ లో మహేశ్ రికార్డ్ ను, దక్షిణాదిలో ధనుస్ రికార్డ్ ను ఏ స్టార్ హీరో అభిమానులు బ్రేక్ చేస్తారో చూడాలి.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
తాజావార్తలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!