అందాల తార, స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి కుమార్తె అర్హ బుల్లి భరతుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిన్నారికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన ‘శాకుంతలం’ చిత్ర బృందం అంతే ఘనంగా వీడ్కోలు పలికింది. విశేషం ఏమంటే… అల్లు అర్జున్ తన కుమార్తె కోసం అత్యంత ఖరీదైన వ్యానిటీ వ్యాన్ ఫాల్కన్ ను కొద్ది రోజుల పాటు ఆమెకే కేటాయించాడు. ఇంకో చిత్రమేమంటే… ఓ పక్క ‘పుష్ప’ షూటింగ్ లో అల్లు అర్జున్ పాల్గొంటే, ఆ పక్కనే అల్లు అర్హా నటిస్తున్న ‘శాకుంతలం’ షూటింగ్ సైతం జరిగింది. ఇలాంటి సంఘటన ఏ పదిహేను, ఇరవై ఏళ్ళకో సాధ్యమవుతుందని భావించానని, ఇంత త్వరగా జరుగుతుందనుకోలేదని అర్జున్ వ్యాఖ్యానించాడు. అల్లు అర్హా ఎంట్రీ ‘శాకుంతలం’ వంటి పాన్ ఇండియా మూవీతో జరగడం ఓ విశేషం కాగా, అది పౌరాణిక చిత్రం, అందులోనూ ఆ చిన్నారి భరతుడి పాత్ర పోషించడం గ్రేట్! ఇక అల్లు అర్హాకు చిత్ర దర్శక, నిర్మాత గుణశేఖర్ టీమ్ ఎంతో గ్రాండ్ గా వెల్ కమ్ పలికారో… అంతే గ్రాండ్ గా ఫేర్ వెల్ పార్టీని జరిపారు. గుణశేఖర్ కుటుంబ సభ్యులు అర్హ పట్ల చూపిన ఆప్యాయతకు అల్లు అర్జున్, స్నేహ దంపతులు ఫిదా అయిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.