లవ్వర్ కు గిఫ్ట్ ఇచ్చేందుకే దొంగగా మారాడు ఓ యువకుడు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో నిన్న జి.కె జ్యూవెలరీలో ఒడిశాకు చెందిన సూరజ్ కుమార్ కద్రకా చోరీకి పాల్పడ్డాడు. జ్యూవెలరీ షాప్ లోని వర్కర్స్ ను డమ్మీ పిస్తోల్ తో బెదిరించి మూడు గోల్డ్ చెయిన్స్ చోరీ చేశాడు. చోరీ చేసి పారిపోతుండగా స్థానికులు పట్టుకొని.. పోలీసులకు అప్పగించారు. పోలీస్ విచారణలో లవ్వర్ కు గిఫ్ట్ ఇచ్చేందుకే చోరీ చేశానని సూరజ్ కుమార్ అంగీకరించాడు. చోరీ కోసం డమ్మీ పిస్తోల్ ను ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేసినట్లు తెలిపాడు. నిందితుడి నుంచి డమ్మీ పిస్తోల్, 90 వేలు విలువ చేసే మూడు గోల్డ్ చైన్లను శ్రీకాకుళం జిల్లా ఎస్పీ స్వాధీనం చేసుకున్నారు.