అల్లు అర్జున్ వ్యవహార శైలి దారుణంగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అల్లు అర్జున్‌లో కనీసం ప్రశ్చాత్తాపం కనిపించడం లేదు.. రేవతి కుటుంబం పైన అల్లు అర్జున్ కనీస సానుభూతి చూపించలేదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలను తప్పు పట్టేలా అల్లు అర్జున్ తీరు ఉందని పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్‌లో నిన్న రాత్రి డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు పెడ్లర్లను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 1కోటి 15 లక్షల విలువైన 1 కేజీ ఎండిఎంఏ, 4 మొబైల్స్ వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
అల్లు అర్జున్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. సంధ్య థియేటర్ వద్ద అభివాదం చేస్తూ వెళ్లడం.. పోలీసులు అనుమతి ఇచ్చారా లేదా అనేది ఆయనకు కూడా తెలుసని అన్నారు. ఈ వ్యవహారం కోర్టులో ఉందని మంత్రి తెలిపారు. పోలీసుల నుండి సమాచారం తీసుకున్న తర్వాతే అల్లు అర్జున్ స్పందించారని అన్నారు.
చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూములను కాపాడడంలో తలెత్తుతున్న ఇబ్బందులు, న్యాయపరమైన అంశాలలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపై న్యాయ నిపుణులతో హైడ్రా కార్యాలయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చెరువుల పరిరక్షణ, పునరుజ్జీవానికి కృషి చేస్తున్న హైడ్రాకు న్యాయ సలహాలు అందించడానికి ఎళ్లప్పుడూ అందుబాటులో ఉంటామని న్యాయ నిపుణులు తెలిపారు.
తన సొంత ఖర్చులతో రేవతి పిల్లలిద్దరికీ చదువులు చెప్పిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈనెల 4న పుష్ప 2 బెనిఫిట్ షో కోసం సంధ్య థియేటర్‌కి రేవతి, భాస్కర్, వారి పిల్లలు శ్రీ తేజ, సాన్విక వెళ్ళారని అన్నారు.
మేడ్చల్ జిల్లా చర్లపల్లి రైల్వే స్టేషన్ను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. ప్రతిష్టాత్మకంగా 430 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ఈనెల 28న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించినట్లు ఈటల తెలిపారు. ఆధునిక హంగులతో రూపుదిద్దుకున్న రైల్వేస్టేషన్ సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి.. నగర వాసులకు జన ఒత్తిడి లేకుండా ఉంటుందని అన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కిమ్స్ ఆస్పత్రికి వెళ్లవల్సిందిగా ఆదేశించారు. ఈ క్రమంలో.. ఆయన కిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో శ్రీ తేజ తీవ్రంగా గాయపడ్డాడు. అతను ఆరోజు నుంచి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం పిల్లాడి బ్రెయిన్ పని చేయడం లేదని డాక్టర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో.. కిమ్స్ ఆస్పత్రికి చేరుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. శ్రీతేజను పరామర్శించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కిమ్స్ ఆసుపత్రిలో శ్రీ తేజ ఆరోగ్యం పై…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగాయి. 7 రోజుల పాటు సాగిన సమావేశాలు.. నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ఎల్పీ ఆఫీసులో హరీష్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఈరోజు సీఎం తీరు గజ్జెల లాగు వేసుకొని కొరడాతో తనని తానే కొట్టుకున్నట్లు ఉందని విమర్శించారు. సీఎం కాబట్టి మైక్ దొరికింది అని మాట్లాడారు.. తమకు మాత్రం మైక్ ఇవ్వనివ్వలేదని అన్నారు.
అసెంబ్లీ సమావేశాల అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. శాసన సభ చరిత్రలో ఎప్పుడు చెప్పని విధంగా అబద్ధాలు చెప్పారని కేటీఆర్ అన్నారు. రైతుబంధు డబ్బులు ఎగ్గొట్టారు.. రైతుబంధు దుర్వినియోగం అయ్యిందని ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. పత్తి రైతులు ఎనిమిది నెలలు పంట పండిస్తారు.. పత్తి రైతులకు రెండో విడత రైతుబంధు ఇవ్వరా? అని ప్రశ్నించారు.
హాట్ హాట్‌గా కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. ఈనెల 9న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 16వ తేదీకి వాయిదా వేశారు. మళ్లీ రెండవ రోజు (సోమవారం) ప్రారంభమైన అసెంబ్లీ.. ఈరోజుతో 7 రోజులు సమావేశాలు వాడీవేడిగా సాగాయి.