CM Revanth: ఆరు గ్యారంటీలు అమలుచేయకపోవడానికి కారణం వీళ్లే.. సీఎం కీలక వ్యాఖ్యలు
- హాట్ హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
- ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవడానికి కారణం బీఆర్ఎస్సే- సీఎం
- తెలంగాణ అప్పు 7 లక్షల 22 వేల కోట్లు- సీఎం రేవంత్
- వాళ్ళు తెచ్చిన అప్పుకు 11.5 వడ్డీ- రేవంత్ రెడ్డి
- వడ్డీ తగ్గించండి అని అడుక్కుంటున్నాం- ముఖ్యమంత్రి
- వేరే దేశాల్లో ఐతే ఉరి తీసేవాళ్ళు- సీఎం రేవంత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవడానికి కారణం.. బీఆర్ఎస్సేనని మండిపడ్డారు. తెలంగాణ అప్పు 7 లక్షల 22 వేల కోట్లు.. వాళ్ళు తెచ్చిన అప్పుకు 11.5 వడ్డీ అని అన్నారు. వడ్డీ తగ్గించండి అని అడుక్కుంటాం.. వేరే దేశాల్లో ఐతే ఉరి తీసేవాళ్ళని ఆరోపించారు. ఢిల్లీకి నేను వెళ్తుంది.. ఆర్థిక శాఖ న్యాయ నిపుణుల కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. మరోవైపు.. హాస్టల్‌లకు మీరేం చేశారని బీఆర్ఎస్ ను సీఎం ప్రశ్నించారు. హాస్టల్ కట్టలేదు.. అమ్మాయిలకు టాయ్లెట్ కట్టలేదన్నారు. నాలుగు గంటల నుండి క్యూ కట్టాల్సిన పరిస్థితి.. పదేళ్లు బాత్‌రూం కూడా కట్టనందుకు క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి అన్నారు. అందుకే ఆయన సభకు రావడం లేదు.. వస్తే కడిగేద్దాం అని ఏడాది నుండి చూస్తున్నానని అన్నారు.
Read Also: AP Rains: లేటెస్ట్ వెదర్ రిపోర్ట్.. ఏపీలో 3 రోజులు వర్షాలే వర్షాలు..!
Also Read
- Afghanistan: ‘ఇన్షా అల్లాహ్.. తగిన సమాధానం ఇస్తాం’.. పాక్‌కు తాలిబన్ల హెచ్చరిక
- Employee Salary: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 5 రోజుల ముందుగానే అకౌంట్లోకి సెప్టెంబర్ నెల జీతం..
- CJP: 48 గంటల్లో రాజీనామా చేయాలి.. జ్ఞానేశ్ కుమార్‌కు CJP అల్టిమేటం..
- Iran-US: ఇరాన్ తాజా వార్నింగ్.. మళ్లీ దాడి చేస్తే యుద్ధం హిందూ మహాసముద్రం దాకా విస్తరిస్తుందని హెచ్చరిక
మీరెంత.. మీ స్థాయి ఎంత.. నా నిబద్ధతను మీరా ప్రశ్నించేదని తీవ్ర స్థాయిలో సీఎం మండిపడ్డారు. పేపర్ దిద్దలేని మీరు.. టీఎస్పీఎస్సీ పరీక్ష పెట్టలేని మీరు.. నన్నా అడిగేదని దుయ్యబట్టారు. కేసీఆర్ దొంగ లెక్కలు చూపించలేదు.. ఈటల కూడా దొంగ లెక్కలు చూపలేదు.. కానీ కేసీఆర్ తరవాత వచ్చిన హరీష్ దొంగ లెక్కలు రాశాడని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పెద్దమనిషి పని ఎట్లా ఉందంటే.. ప్రశ్నపత్రం నువ్వే రెడీ చేసి.. నువ్వే సమాధానం చెప్పి.. నువ్వే ఎక్కువ మార్కులు వేసుకుని ఇదే నా ఘనత అంటున్నాడని విమర్శించారు. అప్పులు ఎక్కడ ఉన్నాయో.. తప్పులు ఎక్కడ ఉన్నాయో చూడనివ్వండని అన్నారు. తమ చేతులు విరగొట్టాలి అని చూస్తున్నారని బీఆర్ఎస్ పై సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read Also: CM Revanth Reddy On Rythu Bharosa: రైతు భరోసాపై సందేహాలు అవసరం లేదు
కొడంగల్ ప్రజలకు తాను ఎంత చేసినా తక్కువేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రజలు ఇచ్చిన దీవనతో సీఎం అయ్యానని తెలిపారు. కోట్ల రూపాయలతో లావాదేవీ పెట్టుకుని ఫార్మా పెట్టొచ్చు.. ఏమీ లేని తన ప్రాంతానికి మెడికల్ కాలేజీ పెడితే తప్పా అని అన్నారు. కాలేజీలు తీసుకున్నా తప్పే అంటారు.. కొడంగల్ 3 లక్షల ఎకరాల్లో 1300 ఎకరాలు తీసుకుని పరిశ్రమలు పెడదాం అనుకున్నానని అన్నారు. కొడంగల్ ప్రజలకు తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ కోట్లు ఖర్చు చేసి అధికారుల మీద దాడి చేయించారని మండిపడ్డారు. కొడంగల్ లో పరిశ్రమలు పెట్టొద్దా.. ఉద్యోగాలు ఇవ్వొద్దా.. మా పిల్లలు డాక్టర్లు కావద్దా అని అన్నారు. అడ్డం వస్తే తొక్కుకుంటూ పోతా అని అందుకే చెప్పానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Faria :దళపతి విజయ్ వారసుడు ‘ఫ్యూచర్ సీఎం’ .. సంజయ్‌పై నటి ఫరియా అబ్దుల్లా క్రేజీ కామెంట్స్!
-
Afghanistan: ‘ఇన్షా అల్లాహ్.. తగిన సమాధానం ఇస్తాం’.. పాక్‌కు తాలిబన్ల హెచ్చరిక
-
NSE Listing: బీఎస్ఈలో ఎన్ఎస్ఈ గ్రాండ్ ఎంట్రీ.. లిస్టింగ్ అయిన గంటలోనే కోటి షేర్లు ట్రేడ్!
-
Employee Salary: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 5 రోజుల ముందుగానే అకౌంట్లోకి సెప్టెంబర్ నెల జీతం..
-
DSP Bheem Reddy : భీమ్ రెడ్డి బినామీలపై ఏసీబీ ఫోకస్.. 8 ఇళ్లలో ఏకకాలంలో సోదాలు
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!