ఈ-కార్ రేసు వ్యవహారంలో ఎక్కడా అవినీతి జరగలేదని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అక్రమంగా బనాయించిన కేసులో హై కోర్టు కేటీఆర్ను అరెస్టు చేయొద్దు అని చెప్పిందని హరీష్ రావు తెలిపారు. ఇది డొల్ల కేసు అని మొదట్లోనే తేలిపోయిందని హరీష్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడారని అన్నారు. తమను సభలో మాట్లాడనివ్వలేదని హరీష్ రావు తెలిపారు. ఈ-కారు రేసులో రూ. 600 కోట్ల అగ్రిమెంట్ కుదుర్చుకున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రూ.600 కోట్ల నష్టం కాదు.. రాష్ట్రానికి రూ.600 కోట్ల లాభం జరిగేదన్నారు. ఈ-కార్ రేసు వల్ల మన రాష్ట్రానికి లాభం జరిగిందని హరీష్ రావు చెప్పారు. నేల్సన్ అనే సంస్థే రాష్ట్రానికి లాభం జరిగిందని చెప్పిందని పేర్కొన్నారు.
Kerala High Court: ఆస్పత్రులు ‘‘ఆధునిక సమాజంలో దేవాలయాలు’’.. దాడులు చేస్తే సహించొద్దు..
ఈ-కార్ రేసు వ్యవహారంలో అవినీతి జరగలేదని స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకరే చెప్పారని హరీష్ రావు అన్నారు. అవినీతే జరగలేదని మంత్రి పొన్నం చెప్పినప్పుడు ఇక ఏసీబీ కేసు ఎందుకు అని ప్రశ్నించారు. డబ్బులు డైరెక్ట్‌గా ట్రాన్స్ ఫర్ అయ్యాయి.. ఇక్కడ అవినీతి ఏముందన్నారు. తెలంగాణ ఇమేజ్ పెరిగే విధంగా ఆనాడు కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేసిందని హరీష్ రావు తెలిపారు. గత ప్రభుత్వానికి మంచి పేరు రావొద్దని కేటీఆర్ పై అక్రమంగా కేసు పెట్టారు.. అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్య పెట్టారని హరీష్ ఆరోపించారు. హామీలపై ప్రజల దృష్టిని మరల్చి జిమ్మిక్కులు చేస్తున్నారని అన్నారు.
Mumbai: స్కూల్ వార్షికోత్సవంలో ఐశ్వర్య దంపతుల డ్యాన్స్.. వీడియో వైరల్
సీఎం కుటుంబ స్కాంలను కేటీఆర్ బయట పెట్టారు.. ఈ క్రమంలో కేటీఆర్‌ను ఎలాగైనా జైళ్లో వేయాలని కుట్రలకు తెర లేపారని హరీష్ రావు పేర్కొన్నారు. తమ క్యాడర్‌లో అయోమయానికి గురి చేయాలని చూశారు.. నీ అవినీతికి కేటీఆర్ అడ్డు వస్తున్నాడని భయ పడుతున్నావని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు చేశారు అని చెబుతున్నారు.. ఒకవేళ ఎన్నికల కోడ్ ఉంటే.. ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుందన్నారు. ఏసీబీకి ఏం పని అని హరీస్ రావు ప్రశ్నించారు. ఒకవేళ తప్పు జరిగితే ఆ కంపెనీ పై ఎందుకు కేసు పెట్టలేదు.. దాన కిషోర్ కేసు చెప్పిన 24 గంటల్లో విచారణ లేకుండా కేసు ఎలా పెడతారని హరీష్ రావు ప్రశ్నించారు.