మూసీ మురుగు నుంచి నల్గొండ జిల్లాకు విముక్తి కల్పిద్దామంటే బీఆర్ఎస్ కాళ్లలో కట్టెలు పెడుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన చేస్తా అంటే వద్దు అంటారు.. ఫ్యూచర్ సిటీ వద్దు అంటారు.. రుణమాఫీ వద్దు అంటారు.. ఇండస్ట్రీ పెడతా అంటే వద్దు అంటారు.. ఏం చేయాలి మరి అని ముఖ్యమంత్రి మండిపడ్డారు. తాను నల్లమల నుండి వచ్చానని… ఇక్కడ తొక్కితే అక్కడికి పోయారు వాళ్ళు అని బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. తనకు గుంటూరులో చదువుకున్న తెలివి తేటలు లేవని.. సామాన్యుడి తెలివి తేటలు ఉన్నాయన్నారు. ఓల్డ్ సిటీ కాదు.. అది ఒరిజినల్ సిటీ దాని అభివృద్ధి గురించి ఎవరికీ పట్టదు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అక్బరుద్దీన్ ఒవైసీ చాలా రోజులుగా ఓల్డ్ సిటీ గురించి అడుగుతున్నారని పేర్కొన్నారు.
Read Also: PM Modi: కువైట్ చేరుకున్న ప్రధాని మోడీ.. ఘనస్వాగతం
బీఆర్ఎస్ పార్టీలో కూడా కొందరు మంచి వాళ్ళు ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కానీ విధిలేని పరిస్థితిలో అక్కడ ఉన్నారు.. వాళ్ళు తనకు కావాల్సిన వాళ్ళేనని చెప్పారు. నల్గొండ ఎస్ఎల్బీసీని పదేళ్లు పడుకో బెట్టారని సీఎం ఆరోపించారు. బావ బామ్మర్దిలకు సవాల్ చేస్తున్నా.. రా మూసీకి పోదామన్నారు. తాను.. రాజగోపాల్ రెడ్డి వస్తామని చెప్పారు. గన్ మెన్లు లేకుండా పోదామని సీఎం అన్నారు. 21 ఏండ్లు అనుభవం అని చెప్పుకుంటున్నారు.. ఆయన అనుభవం స్పీకర్ మీద దాడి చేస్తారా..? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Read Also: Sandhya Theatre Stampede: : ఇకపై నో బెనిఫిట్ షోలు.. టీ సర్కార్ షాకింగ్ నిర్ణయం