ఈరోజుల్లో కుక్కలు, పిల్లులతో పాటు కుందేళ్లు ఇతర జంతువులను పెంచుకుంటున్నారు. మరీ ముఖ్యంగా కుక్కలను చాలా మంది పెంచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా.. వాటిని లక్షలు లక్షలు పెట్టి ఇతర దేశాల నుంచి తెప్పించుకుని మరీ పెంచుకుంటారు. వాటిని ఇంటి సభ్యులుగ భావించి వాటి అవసరాలను పూర్తిగా తీర్చడంలో యజమానులు ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. రిచ్ ఫ్యామిలీ వారు అయితే కుక్కకు తిండి దగ్గర నుంచి మల విసర్జన వరకు ఓ పని మనిషిని పెట్టుకుంటారు.
Minister TG Bharat: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి భరత్ కీలక వ్యాఖ్యలు..
పెంపుడు కుక్కలను రోజుకోసారైనా అలా బయటకు తీసుకువెళ్లాలి.. లేదంటే అవి మొరుగుతూ ఇబ్బందికి గురి చేస్తాయి. పెంపుడు కుక్కలను ఇంట్లో మనిషిలానే పెంచాలి. అయితే.. మనం పెంపుడు కుక్కలను బయటికి తీసుకెళ్లినప్పుడు మూత్ర విసర్జన లేదా మలవిసర్జన చేస్తుంటాయి. అది చూసిన జనాలు అసహనానికి గురవుతారు. దుర్వాసన వల్ల చుట్టుపక్కల వారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో.. మున్సిపల్ అధికారులు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.
Medchal: జల్సాలకి అలవాటు పడి ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్.. ఇద్దరు అరెస్ట్
హైదరాబాద్ నగరంలో.. పెంపుడు కుక్క రోడ్డుపై మలవిసర్జన చేస్తే రూ.1000 జరిమానా విధిస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు. మిగతా మున్సిపల్ ప్రాంతాల్లోనూ ఈ జరిమానా అమలు చేయాలని మున్సిపల్ శాఖ కమిషనర్ & డైరెక్టర్ శ్రీదేవి ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ శాఖ ఈ నిర్ణయంతో.. కుక్క యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. మున్సిపల్ అధికారులు ప్రజల ఆరోగ్యం, రోడ్ల పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నియమాలు విధించారు.