వికారాబాద్ జిల్లా తాండూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్‌ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. అనంతరం.. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. హరీష్ రావు వెంట బీఆర్ఎస్ నేతల బృందం కూడా ఉంది.
ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు రాయితీపై ట్రాఫిక్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ట్రాఫిక్ పెండింగ్ చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మవద్దని పోలీసులు చెబుతున్నారు. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై ఎలాంటి రాయితీ లేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో భారీ వర్షం పడుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నగరంలో వాన దంచికొడుతుంది. అబిడ్స్, కోఠి, నాంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది.
వికారాబాద్ జిల్లా పరిగి సీఐ కార్యాలయంలో ఐజీ సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పరిగిలో ప్రెస్ మీట్ నిర్వహించడంపై ఐజీ స్పందించి ఫైరయ్యారు. పట్నం నరేందర్ రెడ్డి కండిషన్ బెయిల్ పై ఉండి విచారణను ప్రభావితం చేసే విధంగా ప్రెస్ మీట్ పెట్టడం సరి కాదని తెలిపారు. బెయిల్ రద్దుకు సిఫారసు చేస్తామని ఐజీ సత్యనారాయణ హెచ్చరించారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో అన్యమత ప్రచారంపై అధికారులు పొంతన లేని సమాధానం చెబుతున్నారు. బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు తమ పుట్టిన రోజులతో పాటు క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఉండే యాచకులకు, నిరాశ్రయులకు మాంసాహారంతో కూడిన ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు.
సిద్ధిపేట జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. గాలిపటం ఓ బాలుడి ప్రాణం తీసింది. గాలిపటం ఎగరవేస్తూ చెరువులో పడి చనిపోయాడు. లెక్చరర్స్ కాలనీలో ఉండే తేజ (11) గాలిపటం ఎగరవేస్తుండగా ప్రమాదవశాత్తు గాలిపటం దారం తెగిపోయి.. సమీపంలో ఉన్న చెరువులో పడింది. దీంతో.. గాలిపటం కోసం వెళ్లిన ఆ బాలుడు మృత్యుఒడిలోకి వెళ్లిపోయాడు.
హైదరాబాద్ శివారులో యువకులు రెచ్చిపోయారు. కొందరు యువకులు గన్‌తో హల్చల్ చేసిన ఘటన బాచుపల్లి స్పోర్ట్స్ క్లబ్ వద్ద చోటు చేసుకుంది. అర్ధరాత్రి వేళ తుపాకీ గురిపెట్టి యువకులు వీరంగం సృష్టించారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గ్రూప్-1 పరీక్షలపై దాఖలైన అన్ని పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. జీవో 29ను ఛాలెంజ్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. కాగా.. రిజర్వేషన్ల పాటు పలు అంశాలపై గ్రూప్-1 అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే గ్రూప్-1 పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది.