పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లకు మళ్లీ డిస్కౌంట్ వచ్చిందంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ట్రాఫిక్ చలాన్లకు రాయితీ ఇచ్చిన సంగతి తెలిసిందే… డిసెంబర్ 2023లో ప్రకటించిన ఆఫర్ ఈ ఏడాది ఫిబ్రవరి 15న ముగిసింది. కాగా.. మరోసారి డిస్కౌంట్ ఇస్తున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తిరుగుతోంది. కార్లకు 60 శాతం, బైకులకు 60 శాతం వరకు డిస్కౌంట్ అని ప్రచారం జరుగుతుంది. కాగా.. గతంలో పెండింగ్ చలాన్లపై భారీ రాయితీ ఇవ్వడం వల్ల వాహనదారులకు భారీగా రిలీఫ్ లభించింది.
Read Also: Israel-Gaza: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. ఐదుగురు జర్నలిస్టుల మృతి
ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు రాయితీపై ట్రాఫిక్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ట్రాఫిక్ పెండింగ్ చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మవద్దని పోలీసులు చెబుతున్నారు. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై ఎలాంటి రాయితీ లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. అధికారిక వెబ్‌సైట్ echallan.tspolice.gov.in ఉన్న సమాచారాన్ని మాత్రమే వాహనదారులు నమ్మాలని ఆయన సూచించారు. వాహనదారులకు ఏమైనా అనుమానాలు ఉంటే హెల్ప్‌లైన్ నెంబర్లు 040 27852772, 27852721 కు కాల్ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Read Also: Congress: “కాశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్”.. కాంగ్రెస్ తీరుపై బీజేపీ ఫైర్..