వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో అన్యమత ప్రచారంపై అధికారులు పొంతన లేని సమాధానం చెబుతున్నారు. బుధవారం గుర్తుతెలియని వ్యక్తులు తమ పుట్టిన రోజులతో పాటు క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఉండే యాచకులకు, నిరాశ్రయులకు మాంసాహారంతో కూడిన ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. అయితే ఆలయ పరిసరాల్లోకి మాంసాహారం తీసుకు వెళ్ళొద్దనే నిబంధనలు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన ఆలయం సమీపంలోనికి వెళ్లి మాంసాహారంతో కూడిన ఆహారం పంపిణీ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. విషయం తెలుసుకున్న స్థానిక బిజెపి నాయకులు సంఘటన స్థలానికి చేరుకుని మాంసహారంతో కూడిన పాకెట్లను స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Read Also: Siddipet: బాలుడి ప్రాణం తీసిన గాలిపటం..
ఈ క్రమంలో.. ఆలయ అధికారులు ఒక మాట.. పోలీసులు మరో మాట చెబుతున్నారు. ఒకరికొకరు పొంతన లేని సమాధానం చెబుతున్నారు. అన్యమతస్తులు ఓ మతంకి చెందిన ఫోటో ఉన్న బిర్యానీ ప్యాకెట్స్ పంపిణీ చేశారని ఆలయ ఏఈఓ శ్రావణ్ తెలిపారు. ఈ అంశంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం.. ఉదయమే అన్యమతస్తులు బిర్యానీ పంపిణీ చేయడంపై ఆలయ సంప్రోక్షణ చేశామన్నారు. మరోవైపు.. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, మత ప్రచారం జరుగలేదని.. పుట్టినరోజు సందర్భంగా కేవలం బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారని తెలిపారు. బిక్షాటన చేసే వారికి బిర్యానీ ఇచ్చారని ఎస్పీ పేర్కొన్నారు.
Read Also: Masood Azhar: జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కి గుండెపోటు..!