వికారాబాద్ జిల్లా తాండూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. తాండూరు నుండి జహీరాబాద్‌కు వివాహ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. తాండూరు మండలం అంతారం గ్రామ సమీపంలో యాక్సిడెంట్ జరిగింది. తాండూరు నుండి జహీరాబాద్ వైపు వెళ్తున్న లారీ కారుని ఢీ కొట్టింది.
Read Also: Annamalai: అన్నామలై సంచలన ప్రకటన.. డీఎంకేను గద్దె దించేదాకా పాదరక్షలు ధరించనని శపథం
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తాండూరుకి చెందిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒక మహిళ అనిత (36) పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. మిగతా ఐదుగురు బాలమణి (60), శ్రీనివాస్ (46), అశ్విని (34), సమీక్ష (12), షణ్ముఖ ప్రియా (11)లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also: Haish Rao: సంధ్య థియేటర్ ఘటన జరిగిన పది రోజులకు సీఎం, మంత్రులు స్పందించారు..