హైదరాబాద్ శివారులో యువకులు రెచ్చిపోయారు. కొందరు యువకులు గన్‌తో హల్చల్ చేసిన ఘటన బాచుపల్లి స్పోర్ట్స్ క్లబ్ వద్ద చోటు చేసుకుంది. అర్ధరాత్రి వేళ తుపాకీ గురిపెట్టి యువకులు వీరంగం సృష్టించారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా.. ఈ ఘటనపై విషయం తెలిసినా పోలీసులు పట్టించుకోలేదు. మరోవైపు.. యువకుల వీరంగంపై కాలనీ ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. కాగా.. గన్‌తో హల్చల్ చేసిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి.
Read Also: AP Rains: బలహీనపడిన అల్పపీడనం.. ఏపీ వ్యాప్తంగా వర్షాలు..
కాగా.. యువకులకు తుపాకీ ఎక్కడి నుండి వచ్చింది.. యువకులు ఎవరూ అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ విషయం బయటకు పొక్కకుండా కొందరు నాయకులు మేనేజ్ చేస్తున్నారు. మరోవైపు.. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో.. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో.. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Read Also: TG High Court: గ్రూప్-1 ఫలితాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..