వికారాబాద్ జిల్లా పరిగి సీఐ కార్యాలయంలో ఐజీ సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పరిగిలో ప్రెస్ మీట్ నిర్వహించడంపై ఐజీ స్పందించి ఫైరయ్యారు. పట్నం నరేందర్ రెడ్డి కండిషన్ బెయిల్ పై ఉండి విచారణను ప్రభావితం చేసే విధంగా ప్రెస్ మీట్ పెట్టడం సరి కాదని తెలిపారు. బెయిల్ రద్దుకు సిఫారసు చేస్తామని ఐజీ సత్యనారాయణ హెచ్చరించారు. ఫార్మా భూ సేకరణ విషయంలో నరేందర్ రెడ్డిని అరెస్టు చేయలేదు.. పోలీస్ నిఘా వైఫల్యం అనడం సరికాదని పేర్కొన్నారు. లగచర్లలో 230 మంది పోలీసులను బందోబస్తుగా ఏర్పాటు చేశామని ఐజీ తెలిపారు. సురేష్ అనే వ్యక్తి పథకం ప్రకారమే కావాలని కలెక్టర్‌ను గ్రామంలోకి తీసుకువెళ్లాడు.. కలెక్టర్ పై దాడి చేసినందుకే అరెస్టు చేశామని ఐజీ చెప్పారు.
Read Also: Honda Unicorn 2025: కొత్త ఫీచర్లతో మరోసారి బైక్ ప్రియులను మురిపించడానికి సిద్దమైన హోండా యునికార్న్
ఎవరిని కూడా కొట్టలేదు.. రెండు నుంచి మూడు విడతలుగా దాడి చేసిన వ్యక్తులను పట్టుకున్నామని.. సంబంధం లేని వ్యక్తులను వదిలేశామన్నారు ఐజీ సత్యనారాయణ. ప్రెస్‌మీట్‌లో అవాస్తవాలు చెప్పడం మానేయాలని తెలిపారు. ఏ ప్రభుత్వం రైతులకు బేడీలు వేయమని చెప్పదన్నారు. సురేష్ వాయిస్ రికార్డ్ తమ దగ్గర ఉందని.. అతనే మొత్తం ప్లాన్ చేసిందని వెల్లడించారు. టైం వచ్చినప్పుడు బయట పెడతాం.. పట్నం నరేందర్ రెడ్డి సురేష్ విచారణలో అసలు సహకరించడం లేదని ఐజీ సత్యనారాయణ పేర్కొన్నారు. పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ పాస్‌వర్డ్ చెప్పమంటే చెప్పడం లేదని ఐజీ తెలిపారు.
Read Also: GameChanger : రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ థియేట్రికల్ ట్రైలర్ డేట్ ఫిక్స్..?