రీజినల్ రింగ్ రోడ్డు (RRR) నిర్మాణంలో పురోగతి లభించింది. హైదరాబాద్ నార్త్ పార్ట్‌కి కేంద్ర ప్రభుత్వం టెండర్స్ కాల్ ఫర్ చేసింది. నాలుగు లైన్ల ఎక్స్‌ప్రెస్ వే కి కేంద్రం టెండర్స్ పిలిచింది. సంగారెడ్డిలోని గిమ్మాపూర్ నుంచి యాదాద్రి వరకు టెండర్స్ పిలిచింది. మొత్తం నాలుగు పార్ట్స్‌గా రోడ్డు నిర్మాణానికి టెండర్స్ పిలిచింది. 5,555 కోట్ల రూపాయల పనులకు కేంద్రం టెండర్లను పిలిచింది.
నాగార్జునసాగర్ డ్యాం భద్రత తెలంగాణ స్పెషల్ పోలీస్ చేతుల్లోకి వెళ్ళింది. ఇప్పటివరకు భద్రత విధులు నిర్వహించిన కేంద్ర పారా మిలిటరీ బలగాలు వెనక్కి వెళ్లడంతో... ఎస్పీఎఫ్ డ్యాంను తమ ఆధీనంలోకి తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు రోజు నాగార్జునసాగర్ డ్యాంపై ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కేంద్ర ప్రభుత్వం భారత రత్నతో గౌరవించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టింది మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. ఏక మొత్తంలో రైతుల రుణాలు మాఫీ చేసింది ఆయనేనని తెలిపారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఈడీ నోటీసులపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు.. కేటీఆర్ ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఒక్క రూపాయి ఖర్చు చేసిన అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.. ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు ఆర్బీఐకి చెప్పకుండా మన రాష్ట్ర సొమ్ముని దేశ ఫారెన్ కంపెనీల కోసం ఖర్చు పెట్టారని రఘునందన్ రావు ఆరోపించారు.
సిద్ధిపేట నాసరపుర కేంద్రంలోని బ్రిడ్జ్ స్కూల్‌లో మాజీ మంత్రి హరీష్ రావు విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. చలికాలంలో విద్యార్థులు వేడినీళ్లు రాక, దుప్పటి రాక ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. గత నాలుగు నెలల నుండి మెస్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ ఛానల్ పెట్టి రాష్ట్రంలో ఒక్క రూపాయి బిల్లు పెండింగ్ లేదు అని అన్నారు కానీ.. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదని హరీష్…
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సిద్ధం అవుతున్నామని తెలిపారు. హైడ్రాకు చైర్మన్‌గా ముఖ్యమంత్రి ఉంటారని వెల్లడించారు. 2 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధిలో హైడ్రా పని చేస్తుంది.. తమ పరిధిలో 1025 చెరువులను గుర్తించామని రంగనాథ్ పేర్కొన్నారు.
ఈనెల 30న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగనుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి సభ సంతాపం తెలపనుంది. ఈ క్రమంలో సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. సంతాప దినాల్లో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు శాసన సభ నివాళులు అర్పించనుంది.
కర్నాటకలోని బెల్గాంలో జరుగుతున్న సీడబ్ల్యుసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో.. సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ నుంచి మాట్లాడే అవకాశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌లకు దక్కింది.
తెలంగాణ సర్కారుకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అభినందనలు తెలపడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఏం సాధించిందని కాంగ్రెస్ సర్కారుకు శుభాభినందనలను చెప్తున్నాడో రాహుల్ గాంధీ..? అంటూ ప్రశ్నించారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వీర్ బాల్ దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి భారతీయ సాహసయోధులైన సాహిబ్‌జాదా జొరావర్ సింగ్, సాహిబ్‌జాదా ఫతే సింగ్‌లకు ఘన నివాళులర్పించి, వారి త్యాగాలను స్మరించుకున్నారు.