కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి మెల్‌బోర్న్ వీధుల్లో సరదాగా తిరుగుతూ కనిపించాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరూ రోడ్డుపై తిరుగుతున్నారు. ఇద్దరూ కాలినడకన వెళ్తున్నారు.
సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు చెలరేగారు. ఇంతకుముందు వెస్టిండీస్ తో జరిగిన టీ20 సిరీస్ ను సొంతం చేసుకోగా.. తాజాగా వన్డే సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఇండియా 115 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈవిజయంతో మూడు వన్డేల సిరీస్ ను 2-0తో సొంతం చేసుకుంది.
అదానీ పెట్టుబడులను వెంటనే రద్దు చేయడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను సింగిల్ స్ట్రోక్ తో రద్దు చేసే పరిస్థితి ఉండదని అన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడులు పెరిగాయని సీఎం పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిగ్ అప్ డేట్ ఇచ్చారు. కొత్త ఏడాదిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం షురూ అవుతుందని తెలిపారు. ఈ క్రమంలో.. 33 జిల్లాలకు ప్రాజెక్ట్ డైరెక్టర్లను నియమించామని.. ఇందిరమ్మ యాప్ ద్వారా ఇప్పటికే 32 లక్షల దరఖాస్తులు పరిశీలించామని తెలిపారు. మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇళ్లు ఇస్తామని.. తొలి విడతలో దివ్యాంగులు, వితంతువులకు అవకాశం ఇస్తామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని.. గత సంవత్సరం ఆగష్టు సెప్టెంబర్ నెలలో సమ్మెకు దిగారు. అప్పటి టీపీసీసీ అధ్యక్షులు, ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న తమరు వారికి సంఘీభావం తెలిపి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వారి ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్నా వారి సమస్యలను అటకెక్కించారని లేఖలో ప్రస్తావించారు.
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రిస్టియన్ సోదరులకు, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు ఇప్పటికీ.. ఎప్పటికీ ప్రపంచంలోని మానవాళికి మార్గదర్శకమని అన్నారు. అన్ని మతాల సారాంశం మానవత్వమేనని ఆయన ఎంచుకున్న మార్గం అందరికీ దిక్సూచిగా నిలుస్తోందన్నారు.
ABV ఫౌండేషన్ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకోపన్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ ఎంపి సభ్యులు సుధాన్ష్ త్రివేది హాజరయ్యారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వాజ్ పేయి స్ఫూర్తితో ఈ దేశ యువత ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ఐసీసీ (ICC) విడుదల చేసింది. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 22న దుబాయ్‌లో భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. గ్రూప్ దశలో భారత్ మొత్తం మూడు మ్యాచ్ లు ఆడనుంది. మార్చి 9న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
మెదక్ జిల్లాలో రేపు (బుధవారం) పలువురు ప్రముఖులు పర్యటించనున్నారు. అందుకోసం అధికారులు ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్నారు. రేపు వేర్వేరు కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.