ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌పై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ మాట్లాడుతూ.. కేటీఆర్.. మీరు కేసీఆర్ సైనికుడివి కాదు.. యువరాజు అని ఆరోపించారు. పదేళ్ల క్రితం మీ నాయన తెలంగాణ నినాదంతో వచ్చి తెలంగాణను దోచుకున్నాడని తెలిపారు. ఇప్పుడు నువ్వు అదే నినాదం ఎత్తుకోవాలని చూస్తున్నావు.. నీ డైలాగులు చెల్లవని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాపలా కుక్క లెక్క ఉంటాం అని దోచుకున్నారు.. ఏడాది పాలనలో మీద అవినీతి ముద్ర వేయాలని చూస్తున్నారని అన్నారు. రూ. 7 లక్షల కోట్లు అప్పు చేసి కాంట్రాక్టర్లకు దోచి పెట్టావు.. వాళ్లంతా మీ బినామీలే కదా..? అని దుయ్యబట్టారు. మీ సొంత చెల్లి కమిషన్ కోసమే.. కదా లిక్కర్ బిజినెస్ చేసిందంటూ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read Also: Liquor Payments: తెలంగాణా సర్కార్‌కు మద్యం కంపెనీల అల్టిమేటం.. బకాయిలు చెల్లించాల్సిందే!
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ పది సంత్సరాలు మంత్రిగా చేసి ఎంత సహనంతో ఉండాలి.. సహనం కోల్పోయి మాట్లాడుతుండని ఆరోపించారు. లొట్ట పీసు కేసు అంటావ్.. నేను కేసీఆర్ సైనికుడి అంటావ్.. ఇదేనా కేసీఆర్ మీకు నేర్పించిన సంస్కృతి అని విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాని గౌరవించడం నేర్చుకో అని అన్నారు. హెచ్ఎండీఏ రూ.8 వేల కోట్లు పెనాల్టీ చెల్లించింది.. నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు పెనాల్టీ కట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. వాస్తవాలు కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేయకు.. భాష సంస్కృతి నేర్చుకో అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Balmuri Venkat: కేసీఆర్ కుటుంబం వల్ల తెలంగాణ రాష్ట్రం దోపిడీకి గురైంది..
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. కేటీఆర్‌కి ఏ కోర్టులో ఊరట రావటం లేదంటే.. తప్పు చేసినట్లు తేలుతుందన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ విచారణకు పూర్తిగా సహకరించాలి.. ఆర్బీఐ నిబంధనలు తుంగలో తొక్కి రూ. 55 కోట్లు ఎలా దారి మళ్లించారని ప్రశ్నించారు. గ్రీన్ కో కంపనీ ద్వారా ఎలెక్ట్రోల్ బాండ్ల పొందారు అంటే.. క్విడ్ ప్రో కో స్పష్టం అవుతుందని తెలిపారు. ఎన్ని ప్రలోభాలు రేవంత్ రెడ్డిని పెట్టినా.. చట్టపరంగా ఎదుర్కున్నారు తప్ప మీలా వ్యవహరించలేదని పేర్కొన్నారు. సిరిసిల్లలో కేటీఆర్ అండతో భూ అక్రమాలు చేశారు.. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే.. చూస్తూ ఊరుకోం..
చేసిన తప్పులకు మూల్యం చెల్లించక తప్పదని మేడిపల్లి సత్యం అన్నారు.