KTR: ఇంకా వంద కేసులు పెట్టినా ఎదుర్కొంటా.. ఇదొక లొట్టపీసు కేసు
- నాకు మద్దతుగా వచ్చిన మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను- కేటీఆర్
- గత పది సంవత్సరాల్లో కేసీఆర్ నాయకత్వం అవినీతి లేకుండా పని చేశాం
- నన్ను ఏసీబీ వాళ్ళు 80కి పైగా ప్రశ్నలు అడిగారు- కేటీఆర్
- అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్ళీ అడిగారు- కేటీఆర్
- ఇంకా వంద కేస్ లు పెట్టినా ఎదుర్కొంటాం- కేటీఆర్
- ఇదొక లొట్టపీసు కేస్ మాత్రమే- కేటీఆర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఏడు గంటల పాటు కేటీఆర్ విచారణ కొనసాగింది. విచారణ అనంతరం బయటికొచ్చి మీడియాతో మాట్లాడారు. అనంతరం.. అక్కడి నుంచి తెలంగాణ భవన్‌కు వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇన్వెస్టిగేషన్‌లో తనను ఏం ప్రశ్నలు అడగాలో తెలియక ఏసీబీ అధికారులు ఇబ్బందులు పడ్డారని కేటీఆర్ తెలిపారు. ఈ కేసులో అవినీతి ఎక్కడుంది అని అధికారులను అడిగాను.. దీంతో అధికారులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనబడ్డట్లు.. రేవంత్ రెడ్డికి అందరూ దొంగలుగానే కనిపిస్తారని విమర్శించారు. తాను ఒక్క పైసా అవినీతి చేయలేదని చెప్పారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్ కి వస్తా.. ఓపెన్‌గా కెమెరా పెట్టు.. ఈ కేసుపై చర్చిద్దామని సవాల్ చేశారు. కావాలంటే లై డిటెక్టర్ పెట్టు అని కేటీఆర్ అన్నారు.
Read Also: Shamshabad: దారుణం.. కోడలిని చంపి పాతిపెట్టిన అత్తమామలు
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తనకు మద్దతుగా వచ్చిన మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని కేటీఆర్ తెలిపారు. గత పది సంవత్సరాల్లో కేసీఆర్ నాయకత్వం అవినీతి లేకుండా పని చేశామని పేర్కొన్నారు. తనను ఏసీబీ వాళ్ళు 80కి పైగా ప్రశ్నలు అడిగారు.. అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్ళీ అడిగారన్నారు. ఏసీబీ వాళ్లకు కూడా ఈ కేసులో ఏమి లేదని తెలుసని.. ఇంకా తనపై వంద కేసులు పెట్టినా ఎదుర్కొంటామని కేటీఆర్ చెప్పారు. ఇదొక లొట్టపీసు కేసు మాత్రమేనని విమర్శించారు. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లారు కాబట్టి అందర్నీ పంపాలని చూస్తున్నాడు.. నిన్ను ఎవరూ సీఎంగా గుర్తు పట్టట్లేదని వ్యాఖ్యానించారు. అందుకే అందరూ పేరు మరిచి పోతున్నారని ఆరోపించారు. తనను అడగడానికి ఏసీబీ వాళ్ళ దగ్గర ప్రశ్నలు లేవన్నారు. రేవంత్ రెడ్డి ఏమన్నా ప్రశ్నలు పంపితే మళ్లీ పిలుస్తారు ఏమో..
మళ్లీ విచారణకు వెళ్ళడానికి తాను సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ తెలిపారు.
Read Also: Tragedy love story: ప్రియురాలి కుటుంబం వేధింపులు.. యువకుడి ఆత్మహత్య..
తాజావార్తలు
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!