ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. తాజాగా.. కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏడు గంటల పాటు కేటీఆర్ విచారణ కొనసాగింది. విచారణ అనంతరం బయటికొచ్చిన తర్వాత కేటీఆర్ మాట్లాడారు. ఇది అసంబద్ధమైన కేసు అని ఏసీబీ అధికారులకు చెప్పానన్నారు. మళ్లీ ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తానని కేటీఆర్ చెప్పారు. తనకు తెలిసిన సమాచారం అంతా ఏసీబీకి చెప్పానన్నారు. రేవంత్ ఇచ్చిన 4-5 ప్రశ్నలను.. అలా తిప్పి, ఇలా తిప్పి అడిగారు.. విచారణకు పూర్తిగా సహకరించానని కేటీఆర్ చెప్పారు. పైసలు పంపించానని చెబుతున్నా.. పైసలు అక్కడ ఉన్నాయని వాళ్లు చెబుతున్నారు.. ఇక కరప్షన్ ఎక్కడిదని కేటీఆర్ అన్నారు. మరోవైపు.. మీడియాతో మాట్లాడితే పోలీసులకు ఎందుకంత భయం అని ప్రశ్నించారు.
మరోవైపు.. ఏసీబీ ఆఫీస్ నుండి కేటీఆర్ బయల్దేరారు. మరికాసేపట్లో తెలంగాణ భవన్ కు ఆయన రానున్నారు. ఈ క్రమంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 వద్దకు బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
Read Also: ZEE Telugu: సంక్రాంతికి ప్రేక్షకుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపేందుకు వచ్చేస్తున్న జీ తెలుగు..
ఈ విచారణకు కేటీఆర్ తరఫు న్యాయవాది రామచంద్రరావు కూడా హాజరయ్యారు. విచారణ సందర్భంగా పలు అంశాలను ఏసీబీ చర్చకు తెచ్చింది. కేసు సంబంధిత ప్రధాన విషయాలను కేటీఆర్ ముందుంచినట్లు సమాచారం.