Qoo Neo 7 Proకు సంబంధించి కీలక వివరాలు వెలుబడ్డాయి. కొత్త iQoo స్మార్ట్‌ఫోన్ జూలై 4న ఇండియాలో లాంచ్ కానుంది. వేగన్ లెదర్ బ్యాక్‌ను కలిగి ఉన్న ఆరెంజ్ కలర్ ఆప్షన్‌లో ఫోన్ డిజైన్‌ను iQoo టీజ్ చేసింది. ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా ఇండిపెండెంట్ గేమింగ్ చిప్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
WhatsApp Features: వాట్సప్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫీచర్లతో ఆకట్టుకుంటున్న వాట్సప్.. మరికొన్ని ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సప్ లో చాట్ లేదా మెసేజింగ్ సరికొత్త ఫీచర్ ని మీ ముందుంచుంది. ఇప్పుడు ఈ ఫీచర్స్ తో వాట్సప్ ను మీరు మరింత సులభతరం చేసుకోవచ్చు. అయితే ఎలాంటి ఫీచర్స్ ని మన ముందుంచాయో.. అందులో ఎలాంటి సీక్రెట్స్ ఉన్నాయో తెలుసుకుందాం.. Read Also: Prank Viral: చనిపోయినట్లు నమ్మించి అందరిని […]
ఈరోజు (శుక్రవారం) స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజే రూ. 2 లక్షల కోట్లు పెరిగింది. సెన్సెక్స్ 467 పాయింట్లు, నిఫ్టీ 138 పాయింట్లు పెరిగాయి.
చిరకాల ప్రత్యర్థులు ఇండియా మరియు పాకిస్తాన్‌ల మధ్య టెస్ట్ మ్యాచ్‌లను నిర్వహించాలని ఆకాశ్ చోప్రా తెలిపాడు. ఇండియా, పాక్ మధ్య టెస్ట్ మ్యాచ్ లు ఆడితే క్రికెట్ ఫ్యాన్స్ కు మంచి ఎంజాయ్ మెంట్ దొరుకుతుంది. అంతేకాకుండా WTCకి గొప్ప ప్రారంభం అవుతుందని అన్నాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టెస్టు మ్యాచులు ఎందుకు లేవు? ఇది కూడా ఐసీసీ ఈవెంట్‌యే కదా. ఇప్పటికే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ మొదలై నాలుగేళ్లు గడిచిపోయాయి.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పార్టీ ఉన్నతాధికారులతో సమావేశానికి రాష్ట్ర కేబినెట్ మొత్తాన్ని ఢిల్లీకి పిలిచినట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులపై చర్చించడానికి.. అంతేకాకుండా కేంద్ర మంత్రులను విడివిడిగా కలిసే అవకాశం ఉందని డీకే అన్నారు.
జీ-20 సమావేశంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని పేర్కొంటూ, ప్రపంచ ఆహార భద్రతను సాధించేందుకు సమిష్టి చర్యను ఎలా చేపట్టాలనే దానిపై చర్చించాలని జీ-20 వ్యవసాయ మంత్రుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.
మనం ఎవరి పెళ్లికైనా వెళ్తే.. లగ్గం అవ్వగానే వచ్చి భోజనాల మీద పడుతరు. అక్కడ వడ్డించే వారు మనకు ఒక మటన్ ముక్క తక్కువేస్తే.. మనసులో వీడేంటీ పక్కనోళ్లకే ఎక్కువేసి నాకు తక్కువ వేస్తున్నాడని ఫీలవుతాం. ఎందుకంటే పెళ్లిలో మటన్ కూర ఉంటే లొట్టలేసుకొని తింటారు. ఐతే పెళ్లిలో మటన్ తక్కువైందని పెళ్లే ఆగిపోయింది. ఈఘటన ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో ఒకటి చోటుచేసుకుంది. సంబల్ పూర్ కు చెందిన యువతి సుందర్‌గడ్‌కు చెందిన యువకుడిని పెళ్లి చేసుకుంటున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తన సెటిల్ మెంట్ కోసమే.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నట్లు బండి సంజయ్ ఆరోపించారు. అటు మంత్రి కేటీఆర్ నలుగురు బీజేపీ కార్పొరేటర్ లు టచ్ లో ఉన్నారు అని అంటున్నాడు.. మాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్నారు. తాము రాజకీయ వ్యభిచారులం కాదని... బీజేపీలో చేరాలి అంటే రాజీనామా చేయాలన్నారు.
కత్తిపూడి బహిరంగ సభలో ముందస్తు ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలు రావని సీఎం జగన్ కథలు చెప్తున్నాడని.. నవంబర్, డిసెంబర్‌లలోనే ఎన్నికలు జరుగుతాయని పవన్ తెలిపారు.
సీఎం మూడు రాజధానులు అని నాటకాలు ఆడుతున్నాడని.. అమరావతే రాజధానిగా ఉంటుందన్నారు. గాజువాక నుండి తనను గెలిపించి ఉంటే వైజాగ్ దోపిడీ ఆపేవాడినని పవన్ పేర్కొన్నారు. గోదావరి ఈ నేలను విడిచి ఎలా వెళ్లలేదో.. పవన్ కళ్యాణ్ కూడా ఈ నేలను విడిచి వెళ్లలేడని తెలిపారు.