ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవడు ఆపుతాడో చూస్తానని పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో జనసేన వారాహి యాత్రను పవన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. పవన్ కల్యాణ్ అనేవాడు అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయాలని తనపై కక్షగట్టారని ఆరోపించారు. ప్రజల్ని బాగా చూసుకుంటానంటే వైసీపీతో తనకు ఇబ్బంది లేదన్నారు. ఒక్క సీటు కూడా లేని జనసేనను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుమల ఘాట్ రోడ్డులో ఇటీవలే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు టీటీడీ మహాశాంతి హోమం జరిపించింది. అయితే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఎవరూ చనిపోలేదు కానీ.. వాహనాలు పాడైపోయాయి. అంతేకాకుండా భక్తులు గాయాలపాలయ్యారు. అయితే ఆ వెంకటేశ్వరస్వామి చల్లని చూపు వల్లనే భక్తులకు ఎలాంటి ఆపద జరగడం లేదని తెలిపారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. వివిధ కేటగిరీల ఉద్యోగులకు 'స్పెషల్ పే' పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు G.O.Ms.79 ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
మంత్రి అంబటి రాంబాబు కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. పవన్ గురించి పరోక్షంగా ట్వీట్ చేశారు. 'చే గువేరా జన్మదిన సందర్బంగా ఒక ప్రశ్న.. టీ షర్ట్ మీద చే గువేరా.. గుండెల్లో చంద్రబాబు.. ఎవరతను?' అని అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేసి టీడీపీ ఆధ్వర్యంలో ఎస్సీ సభను నిర్వహించారని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. గతంలో చంద్రబాబు మాదిగలకు ఏం చేశాడని ప్రశ్నించారు. గతంలో మాదిగలు సభలు పెట్టుకుంటే చంద్రబాబు అడ్డుకుని కేసులు పెట్టారని ఆరోపించారు.
ఇటీవల ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో టీమిండియా ఘోర పరాజయం పొందింది. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీపై తీవ్రంగా కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. రోహిత్ టైం అయిపోయింది.. అతను కెప్టెన్సీ చేయడం కష్టమంటూ తీవ్ర వ్యాఖ్యలు గుప్పిస్తున్నారు. దీంతో పలువురు రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని కోరుతున్నారు. అయితే బీసీసీఐ కూడా కెప్టెన్ ని మార్చాలనే ఆలోచనకు వచ్చినట్టు సమాచారం.
బీసీ కులాల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. బీసీలు అంటే ఆర్.కృష్ణయ్య గుర్తొస్తారని తెలిపారు. బీసీలకు సాధికారత చేయడం ఓట్లకోసం కాదని సజ్జల అన్నారు. బీసీ సాధికారత దిశగా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ ప్రభుత్వం పని చేసిందని పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుకు హఠాత్తుగా దళితులు గుర్తుకు వచ్చారని విమర్శించారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుంది కదా అందుకే.. చంద్రబాబుకు అన్ని వర్గాల మీద ప్రేమ పుట్టుకు వస్తుందని దుయ్యబట్టారు.
తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగనన్నకు చెబుదాం, గడపగడపకూ మన ప్రభుత్వం, ఉపాధిహామీ పనులు, హౌసింగ్, వ్యవసాయం- సాగునీరు విడుదల, జగనన్న భూ హక్కు- భూ రక్ష కార్యక్రమాలపై సీఎం సమీక్ష చేశారు.
హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో రైతులు పొద్దుతిరుగుడు విత్తనాలపై కనీస మద్దతు ధర అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత నిరసనను విరమించుకున్నారు. పొద్దుతిరుగుడు విత్తనాలపై కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) డిమాండ్‌ను నెరవేర్చడానికి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం అంగీకరించడంతో రైతులు మంగళవారం తమ నిరసనను ముగించారు.