iQoo Neo 7 Pro: iQoo Neo 7 Proకు సంబంధించి కీలక వివరాలు వెలుబడ్డాయి. కొత్త iQoo స్మార్ట్‌ఫోన్ జూలై 4న ఇండియాలో లాంచ్ కానుంది. వేగన్ లెదర్ బ్యాక్‌ను కలిగి ఉన్న ఆరెంజ్ కలర్ ఆప్షన్‌లో ఫోన్ డిజైన్‌ను iQoo టీజ్ చేసింది. ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా ఇండిపెండెంట్ గేమింగ్ చిప్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. మెరుగైన గ్రాఫిక్స్, గేమ్‌ప్లేను అందించడంలో చిప్ గేమింగ్ తోడ్పడుతుందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా 120W ఫాస్ట్ తో ఛార్జింగ్ అవుతుందని.. కేవలం ఎనిమిది నిమిషాల ఛార్జింగ్‌తో 50 శాతం బ్యాటరీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
Read Also: Komatireddy Venkat Reddy : తెలంగాణలో పరిస్థితులను సోనియాకు వివరించా
అయితే iQoo ఫోన్ బ్యాటరీ సామర్థ్యాన్ని పూర్తిగా నిర్ధారించలేదు. అయితే, iQoo Neo 7 Pro ఇండియా వేరియంట్ చైనా నుండి రీబ్యాడ్జ్ చేయబడిన Neo 7 రేసింగ్ ఎడిషన్‌గా లాంచ్ అవుతుందని తెలుస్తోంది. iQoo నుండి రేసింగ్ ఎడిషన్ ఫోన్లు కొన్ని ప్రీమియం హార్డ్‌వేర్‌తో త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. భారతదేశంలో నియో 7 ప్రోగా లాంచ్ అయితే, OnePlus 11R, Vivo V27 Proల రివ్యూలను దాటేస్తుందని కంపెనీ నిర్వహకులు తెలిపారు.
Read Also: Girl Friend: మరో వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడిందని.. ప్రియురాలిని హోటల్‌కి పిలిచి ఏం చేశాడంటే?
ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. 5,000mAh బ్యాటరీ మరియు 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లే పూర్తి-HD+ రిజల్యూషన్ కలిగి ఉంది. iQoo Neo 7 Pro 50-మెగాపిక్సెల్ కెమెరా, 8-మెగాపిక్సెల్ ఉంది. అంతేకాకుండా అల్ట్రా-వైడ్ కెమెరా, మాక్రో సెన్సార్‌ను కూడా కలిగి ఉండే అవకాశం ఉంది. సెల్ఫీల కోసం ఫ్రంట్ కెమెరా 16-మెగాపిక్సెల్ ను కలిగి ఉంది. ఇండియాలో ఫోన్ ధర రూ. 38,000 నుంచి 42,000 మధ్య ఉండనుంది.