WhatsApp Features: వాట్సప్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫీచర్లతో ఆకట్టుకుంటున్న వాట్సప్.. మరికొన్ని ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సప్ లో చాట్ లేదా మెసేజింగ్ సరికొత్త ఫీచర్ ని మీ ముందుంచుంది. ఇప్పుడు ఈ ఫీచర్స్ తో వాట్సప్ ను మీరు మరింత సులభతరం చేసుకోవచ్చు. అయితే ఎలాంటి ఫీచర్స్ ని మన ముందుంచాయో.. అందులో ఎలాంటి సీక్రెట్స్ ఉన్నాయో తెలుసుకుందాం..
Read Also: Prank Viral: చనిపోయినట్లు నమ్మించి అందరిని రప్పించాడు.. చివరికి ఏం చేశాడో తెలుసా?
మీరు వాట్సాప్ గ్రూప్ లో చాట్ చేస్తున్నప్పుడు ఎవరికైనా మెసేజ్ వ్యక్తిగతంగా రిప్లయ్ ఇవ్వాలనుకుంటే ‘రిప్లయ్ ప్రయివేట్’ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. అందుకు మీరు రిప్లయ్ ఇవ్వాలనుకుంటున్న మెసేజ్ నొక్కి పట్టుకోండి. తరువాత పైన కుడివైపు మూలలో ఉన్న 3 చుక్కల పై నొక్కి, రిప్లయ్ ప్రైవేట్ నొక్కండి. ఇప్పుడు మీరు సులభంగా ప్రైవేట్‌గా రిప్లయ్ ఇవ్వవచ్చు. అంతేకాకుండా వాట్సాప్ తాజా వెర్షన్ అద్భుతమైన వాయిస్ నోట్స్ ఫీచర్‌ని తీసుకొచ్చింది. మీ స్టేటస్ లో వాయిస్ క్లిప్‌ని పెట్టుకోవచ్చు. వాయిస్ స్టేటస్ క్రియేట్ చేయడానికి WhatsApp స్టేటస్ ట్యాబ్‌పై నొక్కండి. ఇప్పుడు కింద కుడి మూలలో పెన్సిల్ సింబల్ పై నొక్కండి. తరువాత మైక్రోఫోన్ సింబల్ నొక్కి మీ వాయిస్‌ని రికార్డ్ చేయండి. ఇప్పుడు ఫోటో స్టోరీ లాగా షేర్ చేయవచ్చు. అది కేవలం 30 సెకన్ల ఆడియోను మాత్రమే షేర్ చేయగలుగుతారు.
Read Also: Leo: దళపతి విజయ్ వస్తున్నాడు రెడీనా?
తెలియని వ్యక్తులతో చాట్ చేస్తుంటే మీరు నంబర్‌ను సేవ్ చేయకుండానే చాటింగ్ చేయవచ్చు. దీని కోసం మీరు ఆ నంబర్‌కు సంబంధించిన వాట్సాప్ లింక్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఆ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత దానితో చాట్ ఓపెన్ అవుతుంది. మీరు Android యూజర్ అయితే, WhatsAppలో మీ హోమ్‌స్క్రీన్‌కి చాట్ షార్ట్‌కట్‌ని పెట్టుకోవచ్చు. ఇందుకు WhatsAppలో ఏదైనా చాట్ తెరవండి. ఇప్పుడు దాని షార్ట్ కట్ క్రియేట్ చేయడానికి పైన కుడి మూలలో ఉన్న మెనుపై నొక్కండి. ఇప్పుడు మోర్ అప్షన్స్ కి వెళ్లి, ‘యాడ్ షార్ట్‌కట్’ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ‘యాడ్ షార్ట్‌కట్’ బటన్‌ను నొక్కితే షార్ట్ కట్ క్రియేట్ అవుతుంది. అంతేకాకుండా మీరు మీ ప్రొఫైల్ ఫోటోను ఎవరైనా చూడొద్దు అనుకుంటే దానికి WhatsAppలో ఒక ట్రిక్ కూడా ఉంది. ముందుగా వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘ప్రైవసీ’ విభాగాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ‘ప్రొఫైల్ ఫోటో’పై నొక్కండి. ‘మై కాంటాక్ట్స్’ లేదా ‘మై కాంటాక్ట్స్ మినహా’ అప్షన్స్ ఎంచుకోండి. మీరు మీ ప్రొఫైల్ ఫోటోను చూడొద్దు అనుకుంటున్నా కాంటాక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి అయిపోతుంది.