Pavan Kalyan: కత్తిపూడి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం మూడు రాజధానులు అని నాటకాలు ఆడుతున్నాడని.. అమరావతే రాజధానిగా ఉంటుందన్నారు. గాజువాక నుండి తనను గెలిపించి ఉంటే వైజాగ్ దోపిడీ ఆపేవాడినని పవన్ పేర్కొన్నారు. గోదావరి ఈ నేలను విడిచి ఎలా వెళ్లలేదో.. పవన్ కళ్యాణ్ కూడా ఈ నేలను విడిచి వెళ్లలేడని తెలిపారు. మద్యపాన నిషేధం అనేది సాధ్యం కాదని ఎప్పుడో చెప్పానని.. ప్రాంతాలవారీగా చేయొచ్చని పవన్ చెప్పారు. టీటీడీ నుంచి రిజిస్ట్రార్ వరకు ఒకటే కులానికి పట్టం కడుతున్నారని ఎద్దేవా చేశారు. అమరావతికి చెందిన దాదాపు 200 మందికి పైగా రైతులు గుండెపోటుతో చనిపోయారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Neha Shetty: అర్థరాత్రి నడిరోడ్డుపై.. ఇలా రెచ్చగొట్టొచ్చా రాధికా
మరోవైపు రాష్ట్రంలో సినిమాలు ఆడనివ్వరు.. పరిశ్రమలు రానివ్వరని అన్నారు పవన్. సొంత చిన్నాన్నను చంపిన అన్నను వెనుక వేసుకుని వస్తున్న వ్యక్తి పసి పిల్లడా అని ప్రశ్నించారు. ప్రత్తిపాడులో ఎందుకు పరిశ్రమలు లేవు…ఎందుకు ఉద్యోగాలు రావని ప్రశ్నించారు. అభివృద్ధి పరంగా ఎమ్మెల్యే ఆలోచించడా?.. 2019లో తనను కాదని వైసీపీకి ఓటు వేశారని.. తన అభిమానులు కూడా వైసీపీకి ఓటు వేశారని పవన్ తెలిపారు. కాపులకి బీసి రిజర్వేషన్లు ఇవ్వను అని చెప్పిన వ్యక్తికి కాపు నాయకులు మద్దతు తెలిపారన్నారు. 60 శాతం కాపులు వైసీపీకి ఓటు వేశారని పవన్ తెలిపారు. తన కులాన్ని తాను గౌరవించుకుంటానని.. అందరిని గౌరవిస్తానన్నారు. అంతేకాకుండా అన్ని కులాలతో పాటు తన కులం కోసం కూడా పోరాడతానని పవన్ చెప్పారు. అంతేకాకుండా సీఎం దిగజారి మాట్లాడతాడని పవన్ ఆరోపించారు. వైసీపీ కులాలు మధ్య చిచ్చు పెడుతుందని.. కులాలు చూసి ఓట్లు వేయవద్దు.. మనుషులుగా ఓట్లు వేయండని పవన్ అన్నారు.