జమ్ముకశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో హిందూమతమే ఇస్లాం కంటే అతి పురాతనమైనదని తెలిపారు. ఈ దేశంలో పుట్టిన వారంతా తొలుత హిందువులేనని కీలక వ్యాఖ్యలు చేశారాయన.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చైనా అంశంపై ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. గత 9 ఏళ్లుగా చైనా భారత్‌పై కన్నేసిందని.. అయితే ప్రధాని పూర్తిగా మౌనంగా ఉన్నారని విమర్శించారు.
ఓ బాలికను రేప్ చేసి జైలుకెళ్లిన కామాంధుడు.. జైలు శిక్ష అనుభవించి విడుదలై మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సత్నా జిల్లాలో చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం సత్నా జిల్లాలో మరో మైనర్ బాలికను రేప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు సాత్నాలోని కృష్ణా నగర్‌కు చెందిన రాకేష్ వర్మ (35)గా గుర్తించారు.
రెండు కమిటీల్లోనూ రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నేత వసుంధర రాజే పేరు లేదు. ఇదేంటని బీజేపీని ప్రశ్నించగా.. ప్రతి ఒక్కరికీ ఒక్కో పాత్ర ఇస్తున్నట్లు పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు.
ప్రమాదవశాత్తు గాల్లో ఉన్న విమానంలో పైలట్ మృతిచెందాడు. బాత్రుమ్ కు అని వెళ్లిని ఆ పైలట్.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో కో పైలట్ అలర్ట్ అయి ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు.
భారతదేశపు మొట్టమొదటి లాంగ్ రేంజ్ రివాల్వర్ 'ప్రబల్' ఆగస్టు 18న విడుదల కానుంది. ఈ సరికొత్త రివాల్వర్ ను కాన్పూర్ లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ సంస్థ ప్రత్యేకంగా రూపొందించింది. ఈ రివాల్వర్ 50 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా గురిపెడుతుంది.
ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. శివుడి భక్తిలో మునిగిపోయిన ఒక భక్తుడు.. దేవుడు కోసమని తన తలను సమర్పించేందుకు ప్రయత్నించాడు. 28 ఏళ్ల దీపక్ కుష్వాహ వుడ్ కట్టర్ మెషీన్‌లో తల పెట్టాడు.