Pilot Dies: గాల్లో ఉన్న విమానంలో పైలట్ మృతి.. తర్వాత ఏం జరిగింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రమాదవశాత్తు గాల్లో ఉన్న విమానంలో పైలట్ మృతిచెందాడు. బాత్రుమ్ కు అని వెళ్లిని ఆ పైలట్.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో కో పైలట్ అలర్ట్ అయి ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. అయినప్పటికీ పైలట్ చనిపోయినట్లు వైద్యులు తేల్చారు. ఫ్లోరిడాలోని మియామీ నుంచి చిలీకి వెళ్తున్న లాటామ్ ఎయిర్ లైన్స్ లో ఆదివారం రాత్రి జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Neha Shetty : ఆరెంజ్ డ్రెస్ లో మెరిసిన నేహా శెట్టి.. కిల్లింగ్ లుక్స్ తో అదరగొడుతుందిగా..
Also Read
- POK: పీఓకేను శ్మశానంగా మార్చారు.. UNలో గర్జించిన కాశ్మీర్ మహిళ..
- Cabinet Key Decisions: అమరావతికి కొత్త రూపు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కొత్త ఎక్సైజ్ విధానం..
- Mamata Banerjee: బెంగాల్లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
- Best Places to Visit in India in October: అక్టోబర్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 10 ప్రదేశాలు అస్సలు మిస్ కావొద్దు..
అయితే ఆ విమానంలో 271 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. విమానంలో టేకాఫ్ అయిన మూడు గంటల తర్వాత పైలట్ ఇవాన్ అందౌర్(56) అస్వస్థతకు గురయ్యాడు. కొద్దిగా ఇబ్బందిగా ఉందని చెప్పి బాత్రూమ్ కు వెళ్లాస్తానని కో పైలట్ తో చెప్పి వెళ్లాడు. అయితే అతను ఎంతకూ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి చూడగా.. బాత్రూంలో కుప్పకూలిపోయి ఉన్నాడు. విమానంలో సిబ్బంది అతనికి అత్యవసర చికిత్స అందించారు.. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు. అయితే పైలట్ ఆరోగ్య పరిస్థితిని గమనించిన కో పైలట్ టోకుమెన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఎమర్జె్న్సీ ల్యాండింగ్ చేశాడు. వెంటనే పైలట్ ఇవాన్ ను వైద్య బృందం పరిశీలించగా.. అప్పటికీ అతను చనిపోయినట్లు గుర్తించారు. మరోవైపు ఆ విమానంలోని ప్రయాణికులను ఓ హోటల్ లో ఉంచి వసతి కల్పించిన అధికారులు.. మంగళవారం తిరిగి విమాన కార్యకలాపాలను ప్రారంభించారు.
Credit Card Limit: క్రెడిట్ కార్డ్ లిమిట్ మొత్తం వాడేస్తున్నారా? సిబిల్ పై ప్రభావం పక్కా
మరోవైపు ఈ విషాద ఘటనపై ఎయిర్‌లైన్స్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కెప్టెన్ ఇవాన్ అందూర్ తమ ఎయిర్‌లైన్స్‌లో వెటరన్ పైలట్ అని.. అతడికి 25 ఏళ్ల అనుభవం ఉందని తెలిపింది. ఓ గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉందని ఎయిర్ లైన్స్ పేర్కొంది. మరోవైపు కెప్టెన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. పైలట్ ను కాపాండేందుకు తాము ఎంతో ప్రయత్నించామని.. అయినప్పటికీ ఇవాన్ అందూర్‌ను కాపాడుకోలేకపోయామని ఎయిర్ లైన్స్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
POK: పీఓకేను శ్మశానంగా మార్చారు.. UNలో గర్జించిన కాశ్మీర్ మహిళ..
-
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాక రైతాంగం కన్నీళ్లు పెడుతోంది
-
Paradise First Review: థియేటర్లు బ్లాస్ట్.. ‘ది ప్యారడైజ్’ లాస్ట్ 40 నిమిషాలు నాని ర్యాంపేజ్.. ఆ పాపులర్ హీరో సర్ ప్రైజ్ క్యామియో!
-
Cabinet Key Decisions: అమరావతికి కొత్త రూపు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కొత్త ఎక్సైజ్ విధానం..
-
Baahubali : ఫౌజీ మరో బాహుబలి?
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!