ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. మధురలోని బాంకే బిహారీ దేవాలయం సమీపంలో మంగళవారం సాయంత్రం పెను ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా మూడంతస్తుల భవనం పైభాగం కూలిపోవడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఓ మైనర్ బాలిక రేప్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితురాలి రహస్య భాగాలపై గాయాలు లేనంత మాత్రాన ఆమెపై లైంగిక దాడి జరగలేదని భావించలేమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అత్యాచారం కేసులో పిటిషనర్‌కు కింది కోర్టు విధించిన 12 ఏళ్ల జైలుశిక్షను సమర్థించింది.
సీఎం నితీష్ కుమార్ పాట్నాలోని గాంధీ మైదాన్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగిస్తుండగా.. ఓ యువకుడు హైసెక్యూరిటీ జోన్‌లోకి దూసుకు వచ్చాడు.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ చేశారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా.. రెండు రాష్ట్రాల్లో 65 మందికి పైగా మరణించినట్లు సమాచారం. కొండచరియలు విరిగిపడటం, వరదలు, మేఘాలు, భారీ వర్షాల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్తులకు కూడా […]
రష్యాలోని దక్షిణ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్‌లోని గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 27 మంది దుర్మరణం చెందారు. మరో 100 మందికి పైగా గాయపడినట్లు స్థానిక అధికారులు మంగళవారం తెలిపారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం (ఆగస్టు 15) ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరుకాలేదు. తన కళ్లలో ఏదో సమస్య కారణంగా హాజరు కాలేకపోయానని చెప్పారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. వచ్చే ఏడాది ఆయన నివాసం నుంచే జెండాను ఎగురవేస్తానని చెప్పారు.
సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు డాక్టర్ బిందేశ్వర్ పాఠక్ మంగళవారం (ఆగస్టు 15) కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు.
స్వాతంత్ర్య దినోత్సవం రోజున మణిపూర్ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌లో కొన్ని అపార్థాలు, స్వార్థ ప్రయోజనాలు, విదేశీ కుట్రల కారణంగా మరణకాండ జరిగిందని, ప్రజలు చనిపోయినట్లు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. జెండా వందనం చేసే క్రమంలో ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి డా. ప్రభురామ్ చౌధరి ఉన్నట్టుండి స్పృహతప్పి స్టేజిమీదే పడిపోయారు.