మనసులో ఉన్న బానిస మనస్తత్వాన్ని తొలగించడం ద్వారానే 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ కల సాకారం అవుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒడిశాలో పర్యటిస్తున్నారు. గురువారం ఉదయం 12వ శతాబ్దానికి చెందిన జగన్నాథ ఆలయంలో పూజలు చేశారు. ఆమేతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, స్థానిక ఎమ్మెల్యే జయంత్ సారంగి, లలితేందు విద్యాధర్ మహపాత్ర ఉన్నారు.
Tiger Nageswara Rao: 8 ఏళ్లకే రక్తం తాగిన స్టూవర్టుపురం దొంగ సర్ వాడు..
అనంతరం నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. బ్రిటిషర్లు నెలకొల్పిన బానిస మనస్తత్వం నుంచి విముక్తి పొందాలని.. అప్పుడే 2047లో భారతదేశం అభివృద్ధి చెందిన భారతదేశంగా అవతరిస్తుందని పేర్కొన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చేసి స్వయం సమృద్ధిగా మారుస్తామని ప్రమాణం చేశారు. వలసవాద మనస్తత్వానికి సంబంధించిన ప్రతి చిహ్నాన్ని తొలగిస్తామని తెలిపారు. దేశాన్ని రక్షించేవారిని గౌరవిస్తామని.. పౌరుని యొక్క అన్ని బాధ్యతలను నెరవేరుస్తామని పేర్కొ్న్నారు.
Upendra: దళితులపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. అజ్ఞాతం నుంచి బయటకొచ్చిన ఉపేంద్ర
‘మేరీ మాటి, మేరా దేశ్’ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. అమరవీరుల గౌరవార్థం మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఈ సందర్భంగా.. పాఠశాల, కళాశాల విద్యార్థులు కలిసి త్రివర్ణాలతో భారతదేశ మ్యాప్‌ను రూపొందించారు. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో ధరించిన దుస్తులతో అంతా కలిసి.. దేశ పటం ఆకారంలో నిల్చొని దేశభక్తిని చాటుకున్నారు. మరోవైపు పూరీ జిల్లాలోని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు జయీ రాజ్‌గురు జన్మస్థలమైన బిర్హర్‌కృష్ణపూర్‌లో మేరీ మాతి, మేరే దేశ్ అభియాన్ ఆధ్వర్యంలో అమృత్ కలాష్ లో మట్టిని సేకరించారు. అనంతరం పూరీ జిల్లాలో ప్రచారంలో భాగంగా.. అమరవీరులు, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలను సీతారామన్ సన్మానించారు. అంతేకాకుండా ప్రఖ్యాత ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన ‘మేరి మతి, మేరా దేశ్’ శాండ్ ఆర్ట్ సెషన్‌ను నిర్మలా సీతారామన్ వీక్షించారు. అనంతరం పూరీలో చెట్ల పెంపకం కార్యక్రమంలో పాల్గొన్నారు.