తోవాయి గ్రామంలో ముగ్గురు మృతి చెందిన ఘటనపై.. గిరిజనులు నిరసన చేపట్టారు. కుకీ-జో కమ్యూనిటీ ఆధిపత్యం ఉన్న కాంగ్‌పోక్పి జిల్లాలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వందలాది మంది మహిళలు నిన్న మధ్యాహ్నం నుంచి జాతీయ రహదారిపై ధర్నా చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా అక్కడ నిరసనలు కొనసాగుతున్నాయి.
ఒక మహిళ పైకి ఎక్కి సీలింగ్ చేసిన పెట్టెలో కర్రను పెట్టింది. వెంటనే లోపల ఉన్న 6-7 అడుగులు ఉన్న పాము కొద్దికొద్దిగా బయటకు వస్తూ.. ఆమే చేతికి చుట్టుకుంటుంది. అంతేకాకుండా ఆమే భయపడకుండా.. అందులో నుంచి తీసింది.
మరోవైపు చంద్రయాన్-3 ఉపగ్రహం జాబిల్లికి మరింత చేరువైంది. తాజాగా ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి విజయవంతంగా విక్రమ్ ల్యాండర్ విడిపోయిన విషయం తెలిసిందే. ల్యాండర్ ఇమేజర్ (LI) కెమెరా-1 ద్వారా తీసిన అద్భుతమైన చిత్రాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో X లో షేర్ చేసింది. అయితే గురువారం ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోగానే ల్యాండర్ ఈ ఫోటోలను తీసినట్లు ఇస్రో వెల్లడించింది.
హిమాచల్ ప్రదేశ్ ను వర్షాలు అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజా జల విలయాన్ని ‘రాష్ట్ర విపత్తు’గా ప్రకటిస్తున్నట్లు సీఎం సుఖ్వీందర్ సుఖు తెలిపారు.
భారత్ మొదటి టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ఆరంభంలోనే కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా తన ప్రతాపాన్ని చూపించాడు. రీ ఎంట్రీ తర్వాత అద్భుతమైన ఓపెనింగ్ ఇచ్చాడు. తన మొదటి ఓవర్లలోనే ఐర్లాండ్ రెండు వికెట్లను పడగొట్టాడు.
కోటా విద్యా కేంద్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు అరికట్టడానికి నివారణ చర్యలు చేపట్టింది. కోటాలో అన్ని హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ (పీజీ) నివాసాల్లో స్ప్రింగ్‌లోడెడ్ ఫ్యాన్‌లను ఏర్పాటు చేశారు.
దోమల బారినుండి రక్షించుకోవడానికి మార్కెట్లో వాటి నిర్మూలనకు ఎన్నో వస్తువులు ఉన్నాయి. దోమల బ్యాట్, క్రీములు, ఇతర వస్తువులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఓ వ్యక్తికి తన కాలు మీద దోమ కుడుతుందని ఏకంగా ఓ సుత్తితో కొట్టాడు. దెబ్బకు దోమ సచ్చింది.. బొక్క ఎరిగింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
భారత్, ఐర్లాండ్ మధ్య జరిగే తొలి టీ20 మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా.. తొలి మ్యాచ్ డబ్లిన్ లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 7.30 గంటలకు భారత్, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది.
ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో గత 24 గంటల్లో వర్షాలు దంచికొట్టాయి. భువనేశ్వర్, కటక్ జంట నగరాలతో సహా ఒడిశాలోని 18 జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా ఆ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
కారుపై పడుకొని స్టంట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన ఢిల్లీలోని నోయిడాలో జరిగింది. ఈ వీడియోలో.. ఓ యువకుడు కారు పైకప్పుపై పడుకుని విన్యాసాలు చేస్తూ కనిపించాడు.