దేశంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్డీఏ ఎప్పటికప్పుడు రూపకల్పనలు చేస్తుంది. అందులో భాగంగా రాజస్థాన్ లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల నిర్వహణ కమిటీని, సంకల్ప్ (మేనిఫెస్టో) కమిటీని బీజేపీ ఏర్పాటు చేసింది. అయితే అందుకు సంబంధించి పేర్లను ప్రకటించింది. ఈ రెండు కమిటీల్లోనూ రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నేత వసుంధర రాజే పేరు లేదు. ఇదేంటని బీజేపీని ప్రశ్నించగా.. ప్రతి ఒక్కరికీ ఒక్కో పాత్ర ఇస్తున్నట్లు పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ నేత, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ‘వసుంధర రాజే మా సీనియర్ నాయకురాలు. ఎప్పటినుంచో ఎన్నో కార్యక్రమాల్లో ఆమేను చేర్చుకున్నాం, కొనసాగిస్తాం. అని తెలిపారు.
Flags: నిజమైన దేశభక్తి అంటే ఇది… శభాష్ రా బుడ్డోడా
రాజస్థాన్ లో బీజేపీ.. ఎవరికి ఏ బాధ్యత ఇచ్చిందంటే..? కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌ను ‘ప్రదేశ్ సంకల్ప్ పత్ర సమితి’ కన్వీనర్‌గా నియమించారు. ఈ కమిటీలో రాజ్యసభ సభ్యులు ఘనశ్యాం తివారీ, కిరోరి లాల్ మీనా, జాతీయ మంత్రి అల్కా సింగ్ గుర్జార్, మాజీ డిప్యూటీ స్పీకర్ రావు రాజేంద్ర సింగ్, కేంద్ర మాజీ మంత్రి సుభాష్ మహరియా, మాజీ మంత్రులు ప్రభు లాల్ సైనీ, రాఖీ రాథోడ్‌లు కో-కన్వీనర్‌లుగా నియమితులయ్యారు.
రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణ్ పంచారియా నియమితులయ్యారు. ఇందులో పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఓంకార్‌సింగ్ లఖావత్, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భజన్‌లాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ అగర్వాల్, సమాచార శాఖ మాజీ కమిషనర్ సీఎం మీనా, కన్హయ్య లాల్ బైర్వాల్‌లకు కో-కన్వీనర్‌లుగా బాధ్యతలు అప్పగించారు.