మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MNREGA) పరిధిలోని పని ప్రదేశాలను పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం డ్రోన్‌లను ఉపయోగించనుంది. ఈ డ్రోన్‌ల సహాయంతో వర్క్‌సైట్‌లో కొనసాగుతున్న పనులను పర్యవేక్షించనుంది.
ఢిల్లీలో నెహ్రూ మొమోరియల్ మ్యూజియం పేరును పీఎం మ్యూజియంపై మార్చడంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ స్పందించారు. అనంతరం మోడీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ రాజకీయ చరిత్ర నుంచి నెహ్రూ పేరును ఎవరు చెరిపేయలేరన్నారు. నెహ్రూ పేరు చిరస్థాయిగా ఉంటుందన్నారు. తాను చేసిన మంచిపనులతో నెహ్రూకు గుర్తింపు వచ్చిందని, నెహ్రూ అన్న పేరుతో కాదని రాహుల్ తెలిపారు.
ఇండియన్ నేవీలోకి సరికొత్త యుద్ధనౌక చేరింది. ఐఎన్ఎస్ వింధ్యగిరిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ప్రాదేశిక సముద్ర జలాలపై భారత నావికాదళానికి మరింత పట్టును అందించనుంది స్టెల్త్ యుద్ధనౌక.
018లో జ్యోతిరాదిత్య సింధియాతో పాటు కాంగ్రెస్ నుండి బీజేపీకి వచ్చిన ఇద్దరు సహచరులపై బీజేపీ విశ్వాసం ఉంచింది. రాబోయే ఎన్నికలలో వారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వారికి అవకాశం ఇచ్చింది. ఈ జాబితాలో ఎడల్ సింగ్ కంసనా మరియు ప్రీతమ్ సింగ్ లోధి పేర్లు ఉన్నాయి. అయితే అదే సమయంలో సింధియాతో కలిసి బీజేపీలోకి వచ్చిన రణ్‌వీర్ జాతవ్‌కు టికెట్ దక్కలేదు.
ఉత్తర్రదేశ్ లోని బరేలీ నగరంలోని జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి సమీపంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. గురువారం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయన్న విషయం తెలిసిందే.. ఫేక్ ఐడీలతో మోసగాళ్లు భారీ మోసాలకు పాల్పడుతున్నారు. అయితే ఇప్పటినుంచి సిమ్ కార్డ్ డీలర్లకు పోలీసుల వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అశ్విన్ వైష్ణవ్ గురువారం వెల్లడించారు.